end

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

  • జీహెచ్‌ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం

హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై రాష్ర్టం పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటీఆర్‌ అధికారులు, నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల నియోజకవర్గాల్లో జరుగుతున్న రోడ్ల విస్తరణ, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, డ్రైనేజీ విస్తరణ పనులపై అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం జరగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

ప్రధాని మోడిని చంపేస్తాం !

లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకొని చాలా వరకు హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ, నూతన రోడ్లు, మరమ్మతులు పనులు చేపట్టి సక్సెస్‌ అయ్యారు. ప్రజల నుండి కూడా చాలా పాజిటివ్‌ ఫీడ్‌బాక్‌ వచ్చిందని మంత్రి కెటీఆర్‌ పేర్కొన్నారు.జీహెచ్‌ఎంసీ పరిధిలో 85 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు అందేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Also Read…

Exit mobile version