end
=
Saturday, April 5, 2025
వార్తలురాష్ట్రీయంఅభ్యర్థులతో భేటీ కానున్న మంత్రి కేటీఆర్‌
- Advertisment -

అభ్యర్థులతో భేటీ కానున్న మంత్రి కేటీఆర్‌

- Advertisment -
- Advertisment -

గ్రేటర్‌ బరిలో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున నిలిచిన అభ్యర్థులతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే. తారక రామారావు భేటీ కానున్నారు. మొత్తం 150 డివిజన్ల అభ్యర్థులు ఇందులో పాల్గొంటారు. గ్రేటర్‌ ఎన్నికల్లో అనుసరిచాల్సిన వ్యూహాలపై మంత్రి అభ్యర్థులకు దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వందకు పైగా డివిజన్లను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోంది. క్రితం సారి 100కు ఒక్క స్థానం దూరంలో నిలిచిన టీఆర్‌ఎస్‌ ఈ సారి ఈజీగా వందకు పైగా డివిజన్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. కార్యకర్తల సమన్వయం, ఇన్‌చార్జిల పాత్ర, విస్తృత ప్రచారం వంటి అంశాలపై మంత్రి కేటీఆర్‌.. పార్టీ నేతలకు పలు సూచనలు చేయనున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -