end
=
Friday, September 20, 2024
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీAspire సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రారంభించిన మంత్రి
- Advertisment -

Aspire సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రారంభించిన మంత్రి

- Advertisment -
- Advertisment -

వరల్డ్ టాప్ ఐదు టెక్ కంపెనీలకు మన హైదారాబాద్ నిలయం. సీఎం కేసీఆర్, మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ యువతకు మంచి నైపుణ్యాలు ఉన్నాయి. నీతి ఆయోగ్ ఆవిష్కరణల ర్యాంకింగ్ లో తెలంగాణ రెండో స్థానంలో నిలవడం గొప్ప విషయం. డబుల్ ఇంజిన్ గ్రోత్ రాష్ట్రాలు వెనుకబడ్డాయి. గచ్చిబౌలి లో Aspire సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సేవలు ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ ,హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఫ్లోరిడా, USA ఆధారిత సాంకేతిక సేవల సంస్థ అయిన Fhoenix Technologies లో భాగంగా ఇక్కడ aspire ఏర్పాటు చేయడం సంతోషకరం. తెలుగు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు, అందుకు అనుగుణంగా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడం మంచి విషయం. మూడేళ్లలో 3000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉండేలా విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాను.

సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ ను నిలయంగా మార్చాయి. మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచంలోని ఐటీ సంస్థలకు అగ్రగామి గమ్యస్థానంగా హైదరాబాద్‌ ఉన్నది. ప్రపంచంలోని అతి పెద్ద బహుళజాతి సంస్థలు తమ విస్తరణ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటుచేశాయి.


తెలంగాణ యువతకు ఎంతో టాలెంట్ ఉంది. నూతన అవకాశాలు అనేకం ఉన్నాయి. ఆవిష్కరణ విషయంలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నట్లు మొన్న విడుదలైన నీతి ఆయోగ్ సూచి వెల్లడించింది.
ఆవిష్కరణల సుచీలో కర్ణాటక, తెలంగాణ మొదటి రెండు స్థానాల్లో ఉంటే గుజరాత్, బీహార్ 14, 15 స్థానాల్లో ఉన్నాయి. డబుల్ ఇంజన్ గ్రోత్ రాష్ట్రాలు వెనక బడ్డాయి. ప్రపంచ స్థాయి కంపెనీలు ఇక్కడకు క్యూ కడుతున్నాయి. ఆవిష్కరణల్లో అగ్ర స్థానంలో ఉంటున్నాం అంటే ఇదంతా ఎలా సాధ్యమవుతుంది?. ఒక లక్ష్యంతో పని చేయడం వల్ల. ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడి పౌరులకు కల్పించడం వల్ల.
ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్ట్రక్చర్‌, ఇంక్లూజివ్‌ గ్రోత్‌ విధానానికి తోడు, అద్భుతమైన ప్రభుత్వ విధానాలు శాంతి భద్రతల నిర్వహణ,రాజకీయ సుస్థిరత, ఇక్కడి భౌగోళిక వాతావరణం వల్ల సాధ్యమైంది. అయితే అవకాశాలను అందుకోవడంలో యువత ముందు ఉండాలి. చేసే పనిలో నిబద్దత, అనుకున్న లక్ష్యం స్పష్టత ఉంటే అత్యున్నత శిఖరాలకు ఎదగవచ్చు. Aspire సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సేవలు ప్రారంభించడం సంతోషకరం. మీరు మరింత విస్తరించి, ఇక్కడి యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాను.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -