end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంజనం మధ్యలో మంత్రి శ్రీనివాస్​
- Advertisment -

జనం మధ్యలో మంత్రి శ్రీనివాస్​

- Advertisment -
- Advertisment -

టీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇరకాటంలో పడేశారు. ఫ్రీడమ్ ర్యాలీలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్‌చల్ చేశారు. పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు మంత్రి. పోలీసులకు చెందిన ఎస్ఎల్ఆర్ వెపన్‌తో గాల్లోకి ఫైర్ చేశారు శ్రీనివాస్ గౌడ్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి కాల్పులు ఎలా జరుపుతారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఫైర్ చేస్తున్నా అధికారులు అడ్డుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

అయితే కాల్పుల ఘటన తెలంగాణలో చర్చనీయాంశం కావడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అంటూ మంత్రి వివరణ ఇచ్చారు. తను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని తాను ఎవరి వద్ద గన్ తీసుకొని కాల్చలేదని స్వయంగా ఎస్పీ ఇస్తేనే కాల్చానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ ఇచ్చారు. టీవీలో వస్తున్న కథనాలపై స్పందించారు. ఫోన్ లైన్ లో ఈ ఘటనపై వివరణ ఇచ్చారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -