పెద్ద సంఖ్యలో తరలివచ్చి బర్మింగ్ హామ్ విమానాశ్రయం లో మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ కు ఘన స్వాగతం పలికిన ఇంగ్లాండ్ లో ఉన్న తెలంగాణ కు చెందిన NRI లు, అభిమానులు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ పట్టణంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ ను పరిశీలించడానికి వెళ్లిన రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారికి తెలంగాణ కు చెందిన NRI యువకులు, TRS పార్టీ NRI విభాగం కు చెందిన నాయకులు, మంత్రి అభిమానులు బర్మింగ్ హామ్ అంతర్జాతీయ విమానాశ్రయం కు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారి వెంట జాతీయ హాండ్ బాల్ ఫెడరేషన్ చైర్మన్ జగన్మోహన్ రావు, స్పోర్ట్స్ చైర్మన్ అల్లపురం వెంకటేశ్వర రెడ్డి, నవీన్ తదితరులు ఉన్నారు.