ఎన్ని చట్టాలు వచ్చిన మారని మనుషులు కాపాడాల్సిన వారే కాటు వేసిన సంఘటన. విద్యార్థులను కాపాడాల్సిన ఓ ప్రిన్సిపల్ తన కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి అధ్యాపక వృత్తికే మారని మచ్చగా జరిగిన సంఘటన శుక్రవారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు ఐఎస్ సదన్‌కు చెందిన సత్యనారాయణ కొంత కాలంగా హయత్‌నగర్‌లో గౌతమి గరల్స్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్, కరెస్పాండెంట్‌గా పని చేస్తున్నాడు. ఆ కళాశాలలోనే ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి నమ్మించి సినిమాకు తీసుకెళ్ళి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సత్యనారాయణ కొన్ని రోజులగా విద్యార్థిని వేధిస్తున్నాడు.
ఈ నెల 16న కూడా బాలికకు ఫోన్ చేసి ప్రత్యేక క్లాసు ఉంది చెబుతానంటూ కళాశాలకు కావాలి అని పిలిపించి అసభ్యంగా ప్రవర్తించాడు. అతని వేధింపులు తట్టకోలేక బాలిక జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి పేరెంట్స్ హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, సత్యనారాయణను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రిన్సిపల్‌ను కఠినంగా శిక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో విద్యార్థులు పోలీస్టేషన్ వద్ద ర్యాలీ నిర్వహించారు.