end

Nalgonda:నల్గొండ జిల్లాలో తప్పిన ప్రమాదం:

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద పెను ప్రమాదం తప్పింది. నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travels Bus) ప్రమాదవశాత్తు టైర్ పేలి దగ్ధమైంది. దానిని గమనించి డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు అందరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులు సమాచారం. హైదరాబాద్(Hyderabad) నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సు టైరు పేలి మంటలు వ్యాపించాయి. హైద్రాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై పెద్దకాపర్తి(Peddakaparthi) వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుకు మంటలు వ్యాపించిన విషయాన్ని బస్సులోని ప్రయాణీకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం ఆధారంగా పోలీసులు రామన్నపేట నుండి ఫైరింజన్ ను రప్పించారు.

ఫైరింజన్(Fir engine) వచ్చి మంటలను ఆర్పివేసింది. బస్సు టైర్ పేలి మంటలు వ్యాపించిన విషయాన్ని గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. బస్సులోని ప్రయాణీకులను బస్సు నుండి దింపారు. ఈ బస్సులోని ప్రయాణీకులను మరో బస్సును రప్పించి విజయవాడ(Vijayawada)కు పంపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు(Police) ఆరా తీస్తున్నారు. మంటలు అంటుకోవడంతో ప్రైవేట్ బస్సు(Private Bus) పూర్తిగా దగ్ధమైంది.

(నిజామాబాద్‌ లో ఘోర రోడ్డుప్రమాదం)

Exit mobile version