end
=
Thursday, September 19, 2024
సినీమాసంపూర్ణేష్‌కు తప్పిన ప్రమాదం
- Advertisment -

సంపూర్ణేష్‌కు తప్పిన ప్రమాదం

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్: టాలీవుడ్ ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేశ్ బాబు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ‘బజార్ రౌడీ’ అనే సినిమా క్లైమాక్స్ షూటింగ్‌లో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎత్తు నుంచి బైక్ కిందకు రావలసి ఉంది. సంచుల మధ్య నుంచి కిందకు దూకాలి. బైక్ పై ఉన్న సంపూర్ణేశ్.. అంత ఎత్తు నుంచి కిందకు వస్తున్న సమయంలో అదుపుతప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన షూటింగ్ సిబ్బంది ఆయన దగ్గరకు చేరుకున్నారు. ఆయన్ను పైకి లేవదీశారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంపూర్ణేశ్ బాబు క్షేమంగా ఉన్నారని, త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారని చిత్రవర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే, బజార్ రౌడీ సినిమాకు వసంత నాగేశ్వర రావు దర్శకత్వం వహిస్తున్నారు. సందిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -