end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంజాతీయ జెండాలపై ఎమ్మెల్యే ఫోటో
- Advertisment -

జాతీయ జెండాలపై ఎమ్మెల్యే ఫోటో

- Advertisment -
- Advertisment -

75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరంలోకి అడుగుపెట్టిన భారతదేశ స్వాతంత్య్ర నికి ప్రతీకగా నేడు యావత్ భారతదేశం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది.కొన్నిచోట్ల మితిమీరిన దేశభక్తితో చెయ్యకూడని పనులు చేస్తున్నారు. అలాంటి ఘటన హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో జరిగింది. కుత్బుల్లాపూర్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండాపై ఎమ్మెల్యే వివేకానంద ఫోటోలో ఉండటం చర్చనీయాంశమయ్యింది. అది ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.జాతీయ జెండాలో ఎమ్మెల్యే, అభిమాని ఫోటోలు చూసి జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు జాతీయ జెండాను అవమానించిన అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జెండాను తలకిందులుగా చేసి పట్టుకోవడం, జాతీయ జెండాలో గులాబీ రంగు మిక్స్ చేసి పోస్టర్లు వేయడం వంటి అనేక ఘటనలు మర్చిపోకముందే తాజాగా, జాతీయ జెండా పై ఎమ్మెల్యే ఫోటోను ముద్రించిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -