end

VIP facilities:ఎమ్మెల్యేలకు VIP సౌకర్యాలు ఉండవు

  • హిమచల్ సీఎం సుఖ్వీందర్ నిర్ణయం
  • త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ


హిమచల్ ప్రదేశ్‌లో(Himachal Pradesh) నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు(Sukhwinder Singh Sukh) కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం పార్టీ శాసనసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలకు ప్రత్యేక సౌకర్యాలు ఏమి ఉండబోవని స్పష్టం చేశారు. శాసనసభ్యులు(Legislators), అధికారులు సాధారణ పౌరుల వలె హిమచల్ భవన్, హిమచల్ సదన్‌లలో సేవలు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇవి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కూడా వర్తించనున్నట్లు తెలిపారు. మరోవైపు త్వరలోనే రాష్ట్ర కేబినెట్‌ను విస్తరిస్తామని చెప్పారు. అంతేకాకుండా తమ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీ వన్ పెన్షన్ స్కీం(One Pension Scheme)పైన కూడా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నేరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాగా, ఆదివారమే హిమచల్ ప్రదేశ్ 15వ సీఎంగా సుఖ్వీందర్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

(Bhupendra Patel:గుజరాత్ 18వ సీఎంగా భూపేంద్ర పటేల్)

Exit mobile version