తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత పాల్గొన్నారు. అమ్మవారికి కవిత బంగారు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు కవితను ఆశీర్వదించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. మోండా మార్కెట్ డివిజన్‌లోని ఆదయ్య నగర్ లైబ్రరీ నుంచి 2 వేల మంది మహిళలతో ఎమ్మెల్సీ కవిత ర్యాలీగా బయల్దేరి మహంకాళీ ఆలయానికి చేరుకున్నారు. కవిత వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.