- తమిళనాడు ఆంధ్రా చెక్‌పోస్టు వద్ద ఘటన
- డ్రైవర్‌ను చితకబాది కంటైనర్ ఎత్తుకెళ్లారు
సుమారు రూ.10 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు తీసుకెళ్తున్న లారీ కంటైనర్‌ను సినీఫక్కీలో హైజాక్ చేసి రూ.5 కోట్ల విలువైన మొబైల్ బాక్సులను దోచుకెళ్లారు దుండగులు. ఈ ఘటనా ఆంధ్రా తమిళనాడు సరిహద్దు ప్రాంతం పొన్‌పాడి చెక్‌పోస్టు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే ఎం.ఐ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్స్ లోడ్ కంటైనర్‌లో తమిళనాడు నుండి ముంబై వెళుతోంది.
కరోనా నుంచి కోలుకుంటున్న ‘SPB’
అయితే దుండగులు దీన్ని గమనించి మరో లారీలో వెంబడించారు. సరిగ్గా తమిళనాడులోని పొన్‌పొడి చెక్‌పోస్టు వద్దకు కంటైనర్ చేరుకోగానే ఆ దొంగలు డ్రైవర్‌ను చితకబాది కంటైనర్‌తో సహా లారీని ఎత్తుకెళ్లారు. కొంతదూరం వెళ్లిన తర్వాత అందులోని 16 బాక్సుల్లో 8 బాక్సులు ఎత్తుకెళ్లిపోయారు.
వరుడు ముందే వధువుకు ముద్దుపెట్టిన ప్రియుడు
ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆగి ఉన్న కంటైనర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సుమారు వీటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అనుమానితుడు ముంబైకి చెందిన డ్రైవర్ ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు వివరించారు.
షాపూర్‌లో సినీ ఆర్టిస్టులతో వ్యభిచారం