- జీ-20 సమావేశాల్లో భారత ప్రధాని బిజీబిజీ
- మూడేళ్ల తరువాత జిన్‌పింగ్‌తో సమావేశం
- బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో చర్చలు
G20 Summit 2022: జీ-20 సమావేశాల్లో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Chinese President Jinping) తో భేటీ అయ్యారు (PM Modi ) ప్రధాని మోదీ. అమెరికా అధ్యక్షుడు బైడెన్ (America President Biden), బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (British Prime Minister Rishi Sunak)తో కూడా సమావేశమయ్యారు. పర్యావరణం, ప్రపంచ ఆరోగ్యరంగంపై ససమావేశాల్లో కీలక చర్చలు జరిగాయి.
బాలి (Baali)లో జీ-20 సమావేశాల్లో బిజీబిజీగా నేతలతో సమావేశమవుతున్నారు మోదీ. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అయ్యారు. జీ-20 నేతల డిన్నర్ (Dinner) సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మూడేళ్ల తరువాత చైనా అధ్యక్షుడితో నేరుగా సమావేశమయ్యారు. పర్యావరణం, ప్రపంచ ఆరోగ్యరంగం (Environment and Global Health) వివిధ దేశాధినేతలో కీలక చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో కూడా పలు అంశాలపై చర్చలు జరిపారు. మోదీతో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ఇరు దేశాల మధ్య బుధవారం నాడు విస్తృత స్థాయి చర్చలు జరగనున్నాయి. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్ మోదీని కలవడం ఇదే తొలిసారి.
సునాక్‌తోపాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మూన్యుయేల్ మెక్రాన్ల (French President Emmanuel Macron)ను ప్రధాని మోదీ కలిశారు. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో (Indonesian President Joko Widodo) పాటు రిషి సునాక్, మెక్రాన్‌లతో బుధవారం ప్రధాని మోదీ విస్తృత స్థాయి చర్చలు జరుపుతారు. వాతావరణ మార్పులు, కరోనా (covid) 9 మహమ్మారి, ఉక్రెయిన్ (Ukraine)లో పరిస్థితులతోపాటు దానితో ముడిపడి ఉన్న అంతర్జాతీయ సమస్యలు ప్రపంచంలో విధ్వంసానికి కారణమయ్యాయని జీ-20 సదస్సులో ప్రధాని మోదీ పేర్కొన్నారు. బుధవారం జీ-20 అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా నుంచి భారత్ (India) స్వీకరిస్తుంది.
(Telangana High Court:ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణకు ఓకే)
దీనికి ముందు సమర్‌కండ్ (Samarkand)లో జరిగిన షాంఘై (shanghai)సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, జీ జిన్‌పింగ్‌లు చివరిసారిగా కలుసుకున్నారు, అయితే ఇద్దరు నేతలు కెమెరా ముందు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. దీని తరువాత ప్రధాని మోదీ బుధవారం (నవంబర్ 16) బ్రిటన్ ప్రధాని రిషి సునక్, అనేక ఇతర ప్రపంచ నాయకులను కలవడం ద్వారా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. సమావేశ ప్రణాళికను ముందుగా నిర్ణయించలేదు. తూర్పు లడఖ్ (Ladakh)లోని భారత సరిహద్దులోకి చైనా చొరబడిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత దృష్ట్యా, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, పీఎం, జీన్ పింగ్ మధ్య ఎలాంటి సమావేశం ముందస్తుగా జరగలేదని అధికారులు తెలిపారు. విందు సమయంలో, PM మోడీ US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ పక్కన కూర్చున్నారు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడటం కనిపించింది. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హాజరుకాలేదు.