end

Modi’s convoy:అంబులెన్స్‌కు దారిచ్చిన మోదీ కాన్వాయ్

  • ప్రశంసలు కురిపిస్తున్న దేశ ప్రజలు


గుజరాత్ (Gujarath) ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంంద్ర మోడీ (Narendramodi) మరోసారి గొప్ప మనస్సును చాటుకున్నారు. అంబులెన్స్‌కు (Ambulance) దారి ఇవ్వడం కోసం కాసేపు తన కాన్వాయ్‌ను ఆపారు. డిసెంబర్ 5న జరగనున్న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో (Ahmedabad) మెగా రోడ్‌షో నిర్వహించారు. భారీ జనసందోహం మధ్య ప్రధాని మోడీ గురువారం సాయంత్రం అహ్మదాబాద్‌లో రోడ్‌షో కొనసాగింది. బీజేపీ అభ్యర్ధుల గెలుపుకోసం అహ్మదాబాద్‌ లోని 16 సీట్లను కవర్‌ చేస్తూ 50 కిలోమీటర్ల మేర ప్రధాని మోడీ రోడ్‌షో జరిగింది. కాన్వాయ్ నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోడీ.. ముందుకు సాగారు.ఈ సమయంలో కాన్వాయ్ వెనుకనుంచి వస్తున్న అంబులెన్స్ భారీ జనసందోహం మధ్య ఇరుక్కుపోయింది. ఈ సమయంలో అంబులెన్స్‌ను గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ.. దానికి దారి ఇచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయి.. నరేంద్ర మోడీ కాన్వాయ్‌ (Convoy)ను కొన్ని సెకన్ల పాటు పక్కకు ఆపి.. అంబులెన్స్ వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

ఈ మేరకు వార్తా సంస్థ ఏఎన్ఐ (NIA) వీడియోను షేర్ చేసింది. ప్రధాని ప్రయాణిస్తున్న వాహనం వెనుక నుంచి వచ్చిన అంబులెన్స్‌కు దారి ఇవ్వడం దీనిలో కనిపించింది. మానవత్వానికి ప్రతిరూపంగా ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు అభినందిస్తున్నారు. గతంలో కూడా ప్రధాని మోడీ అంబులెన్స్‌కు దారి ఇచ్చిన విషయం తెలిసిందే.హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ (Himachal Pradesh Assembly Elections) ఎన్నికలకు ముందు కాంగ్రాలో జరిగిన ర్యాలీ సందర్భంగా.. ప్రధాని మోదీ అంబులెన్స్ కోసం తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. దీంతోపాటు సెప్టెంబర్ (September) 30న అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు (Gandhinagar)వెళుతుండగా అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి ప్రధాని మోదీ కాన్వాయ్ కాసేపు ఆగింది.

అలాగే ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీరాముని భక్తులు ఉన్న గడ్డలో ఓ వ్యక్తిని రావణుడని అభివర్ణించడం సరికాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. తనను అవమానించేందుకు కాంగ్రెస్‌లో పోటాపోటీ ఉందని చెప్పారు. తీవ్రంగా, పదునైన మాటలతో అవమానించడంలో పోటీ ఉందన్నారు. గుజరాత్ (Gujarat) శాసన సభ ఎన్నికల్లో బీజేపీ (BJP) తరపున ప్రచారం చేస్తున్న మోదీ గురువారం కలోల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఇటీవల మోదీని ఉద్దేశించి ‘రావణుడు’ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

కొద్ది రోజుల క్రితం ఓ కాంగ్రెస్ (Congress) నేత మాట్లాడుతూ, మోదీ కుక్క చావు చస్తారని అన్నారని గుర్తు చేశారు. నియంత హిట్లర్ (Hitler) మాదిరిగా మోదీ చచ్చిపోతారని మరొక కాంగ్రెస్ నేత అన్నారని తెలిపారు. నేనే మోదీని చంపేస్తానని మరొక నేత అన్నారన్నారు. రావణుడని ఓ నేత, రాక్షసుడని మరొక నేత, బొద్దింక అని మరో నేత తనను అవమానిస్తున్నారని తెలిపారు. తనను కాంగ్రెస్ నేతలు దూషించడం తనకేమీ ఆశ్చర్యంగా లేదన్నారు. కానీ అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ కాంగ్రెస్ పశ్చాత్తాపం చెందడం లేదని తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ విషయంలో ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుందన్నారు.

(Gujarat Election:గుజరాత్‌లో మొదలైన తొలి దశ ఫైట్)

తనకు గుజరాత్ ఇచ్చిన బలం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా ఉందన్నారు. ‘మోదీకి ఆయన స్థాయి ఏమిటో ఈ ఎన్నికల్లో చూపిస్తామ’ని మరో కాంగ్రెస్ నేత అన్నారని తెలిపారు. అది సరిపోదని, ఇంకా ఏదో మాట్లాడవలసి ఉందని కాంగ్రెస్ భావించిందని, అందుకే ఖర్గేను(Kharge) పంపించిందని చెప్పారు. తాను ఖర్గేను గౌరవిస్తానన్నారు. ఆయన అడిగినదానికి సమాధానం చెప్పవలసి ఉందన్నారు. గుజరాత్ రామ భక్తుల (Devotees of Sree Ram) రాష్ట్రమని కాంగ్రెస్‌కు తెలియదన్నారు. ఖర్గే ఇక్కడికి వచ్చి మోదీ 100 తలలుగల రావణాసురుడని అన్నారని చెప్పారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, మోదీ మన దేశానికి ప్రధాన మంత్రి అని, ఆయన తన పదవికి సంబంధించిన కార్యకలాపాలను మర్చిపోయారని, కార్పొరేషన్ (Corporation) ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు (MLA elections, MP elections)… ఇలా ఏ ఎన్నికలు వచ్చినా ఆయనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడు చూసినా ఆయన తన గురించే మాట్లాడతారన్నారు. ‘‘మీరు మరొకరిని చూడనక్కర్లేదు, కేవలం మోదీని చూడండి, ఓటు వేయండి’’ అని చెబుతారన్నారు. మీ ముఖాన్ని ఎన్నిసార్లు చూడాలని ప్రశ్నించారు. మీకు ఎన్ని రూపాలు ఉంటాయని ప్రశ్నించారు. మీకు రావణాసురుడి మాదిరిగా 100 తలలు ఉన్నాయా? అని నిలదీశారు. కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీ (Madhusudan Mistry) ఇటీవల మాట్లాడుతూ, ఓ స్టేడియంకు నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై మాట్లాడుతూ, మోదీకి తన స్థాయి ఏమిటో ఈ ఎన్నికల్లో చూపిస్తామని అన్నారు.

Exit mobile version