end

‘సలార్’ మూవీలో మోహన్‌లాల్..?

మళయాల సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ సరికొత్త మల్టీస్టారర్‌కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. బాహుబలి సిరీస్‌తో వరల్డ్‌వైడ్‌ పాపులర్‌ అయిన ‘యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌’ కథానాయకుడిగా.. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రకు ‘మోహన్‌లాల్‌’ను ఎంపిక చేసుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో ఓ టాక్‌ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ప్రభాస్‌ పాత్రకు ధీటుగా ఆయన పాత్రను రూపొందించినట్లు డైరెక్టర్‌ వెల్లడించారు. ఇదే నిజమైతే సలార్‌ సినిమాపై అభిమానులు మరింత ఆసక్తి పెంచుకుంటారు. కాగా, మోహన్‌లాల్‌ ఇదివరకే జూనియర్ ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్‌’ మూవీలో నటించిన విషయం విదితమే. ఈ సినిమా సూపర్ డూపర్‌ హిట్‌గా నిలిచింది.

Exit mobile version