end
=
Friday, September 20, 2024
సినీమాహోస్ట్‌గా మోనాల్‌..!
- Advertisment -

హోస్ట్‌గా మోనాల్‌..!

- Advertisment -
- Advertisment -

బిగ్ బాస్ షోకు రాక‌ముందు నాలుగైదు సినిమాలలో న‌టించినప్పటికీ.. పెద్దగా గుర్తింపు తెచ్చుకోని మోనాల్ బిగ్ బాస్‌ రియాలిటీ షోతో అంద‌రి హృద‌యాల‌ను ఆకర్షించింది. ముఖ్యంగా తన క్లీవేజ్‌ షోలతో కుర్రకారు మతి పోగొట్టింది ఈ అమ్మడు. ఇప్పుడు మోనాల్‌ యూత్ క‌ల‌ల రాణిగా మారిందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ అమ్మడిని ప‌లు షోస్‌కు యాంక‌ర్‌గానో లేదంటే సినిమాల్లో హీరోయిన్‌ గానో చూడాల‌ని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ప‌రిస్థితులు చూస్తుంటే వారి కోరిక‌లు ఫ‌లించిన‌ట్టే క‌నిపిస్తుంది.

గ‌తంలో స్టార్ మా యాజ‌మాన్యం బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన లేడి కంటెస్టెంట్స్‌కు ప‌లు ఆఫ‌ర్స్ ఇచ్చింది. తేజ‌స్విని, శ్రీముఖి వంటి అందాల భామ‌లు కొన్నాళ్లు బుల్లితెరపై హ‌ల్ చ‌ల్ చేశారు. ఇప్పుడు మోనాల్ టైం వ‌చ్చింది. డ్యాన్స్ ప్లస్ అంటూ ఓంకార్ చేయ‌నున్న క్రేజీ కార్యక్రమంలో మోనాల్ హోస్ట్‌గా క‌నిపించ‌నుంద‌నే టాక్ వినిపిస్తుంది. తాజాగా మోనాల్‌కు సంబంధించిన ప్రోమో విడుద‌ల చేయ‌గా, ఈ కార్యక్రమంలో అమ్మడి పాత్ర ఏంట‌నే దానిపై పూర్తి స్పష్టత లేదు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -