-
50 మందిని మోసం చేసిన కి లేడీ
-
నిత్య పెళ్లి కూతురి ఆటకట్టు
చెన్నై (Chennai) : పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసి నూరేళ్లు` అని ఆచార్య ఏనాడో రాశాడు. (kiladi lady) కానీ ఈ భాష్యం ఆమెకు వర్తించదు. వాట్సాప్ స్టేటస్ మార్చినట్లు ఆమెకు రోజుల్లో భర్తలను మార్చడం అలవాటు. ఇలా పెళ్లి చేసుకోవడం అలా డబ్బూ నగలతో ఉడాయించడం.. మళ్లీ మరో వ్యక్తికి గాలం వేయడం.. డబ్బు తీసుకుని చెక్కేయడం.. ఇదీ ఆమె స్టైల్ ! కానీ ఆమె సాగుబాటు ఎంతకాలమో సాగలేదు.
చివరకు కటకటాలు లెక్కించక తప్పలేదు. అసలు ఆ కి`లేడీ` పోలీసులకు ఎలా చిక్కిందంటే.. తమిళనాడులోని (tamilanadu) తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడి సంధ్య పేరుతో ఓ అమ్మాయి పరిచయమైంది. వారి పరిచయం ప్రేమగా.. తర్వాత వివాహానికి దారి తీసింది. వారి సంసారం ముచ్చటగా మూడు నెలలు సాగింది. ఆ తర్వాత భర్తకు అనుమానం వచ్చి భార్య ఆధార్ కార్డ్ అడిగాడు. ఆధార్ కార్డ్‌లో వేరే పేరు ఉండటం చూసి అవాక్కయ్యాడు. ఇదేంటని నిలదీస్తే తిరిగి భర్తనే బెదిరించింది. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది.
ఆమె అధికారికంగా సుమారు 40 మందిని వివాహం చేసుకున్నదని, (half century) వీరే కాక మరో 10 మందిని ట్రాప్ చేసిందని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. (gold) వారి నుంచి భారీగా నగలు, డబ్బు అపహరించిందని గ్రహించి వాటిని రికవరీ చేసే పనిలో పడ్డారు. అబ్బయిలూ.. తస్మాత్ జాగ్రత్త ! పెళ్లి విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని, విచారించుకుని వివాహం చేసుకోండి.