end

దేశంలో మంకీపాక్స్‌ కేసులు

కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతున్న వేళ దేశంలో మరో వైరస్‌ కలకలం రేపుతోంది. విదేశాలలో పర్యటన చేసిన వ్యక్తులకు మంకీపాక్స్‌ సోకడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. దేశంలో 80కి పైగా మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. మశూచిని పోలిఉండే ఈ వైరస్‌ను ముందు జాగ్రత్త చర్యల ద్వారా నివారించవచ్చని వైద్య అరోగ్య శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. జ్వరం, తలనొప్పి, శరీరంపై వాపులు, కండరాల నొప్పి, శరీరంపై నీటి బుగ్గలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వారి రక్తం, లాలాజలం నమూనాలు సేకరించి వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తారు. వారిని ఐసోలేషన్‌ చేయడంతోపాటు వారు ఎవరిని కలిశారో వివరాలు సేకరించాలని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. లక్షణాలు ఉన్నవారు కనీసం 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు.

Exit mobile version