end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంరెండు రోజుల్లో ఋతుపవనాలు
- Advertisment -

రెండు రోజుల్లో ఋతుపవనాలు

- Advertisment -
- Advertisment -

ఋతుపవనాలు ఆలస్యమవుతన్న వేళ వాతావరణ శాఖ రైతులకు శుభవార్త తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో అంటే సోమవారం లేదా మంగళవారం తెలంగాణ రాష్ర్టంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కొంకణ్‌, కర్నాటక, గోవాలో తీర ప్రాంతాల్లో ఇప్పటికే రుతుపవనాలు విస్తరించాయని ఇక రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు.

(ఎం‌ఎం‌టి‌ఎస్ ప్రయాణికులకు ముఖ్యగమనిక)

ఇక హైదరాబాద్‌లో మాత్రం వేడిమి తగ్గడం లేదు. గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రివేళల్లో వాతావరణం చల్లబడడం లేదు. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలావుండగా శనివారం నాడు ఆదిలాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -