end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంతెలంగాణాలో విస్తారంగా వర్షాలు
- Advertisment -

తెలంగాణాలో విస్తారంగా వర్షాలు

- Advertisment -
- Advertisment -

ఉపరితలన ద్రోణి ఆవర్తన ప్రభావం వల్ల గత మూడు రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ర్టంలో పలు జిల్లాలో కుంటలు, చెరువులు నిండాయి. కొన్ని జిల్లాలో చెక్‌డ్యాంలు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 12 సెం.మీలు, ఉమ్మడి వరంగల్‌ జిల్లల్లో వర్షం భారీగా వర్షం పడింది. భూపాలపల్లి సింగరేణిలో వర్షం వలన సుమారు రూ.4.12 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు.

మేడారం దగ్గరలో ఉన్న జంపన్నవాగు పొంగి పొర్లుతుంది. మెదక్‌ జిల్లాలో దాదాపు అన్ని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నిండు కుండను తలపిస్తున్నాయి. ఇక హైదరాబాదులో అయితే మూడు రోజులు నుండి ఎడతెరపిలేకుండా 24 గంటలు ముసురు వర్షం కురుస్తూనే ఉంది. ప్రజలు ఎవరూ బయటకు రావడం లేదు. ఒక్కసారిగా వాతావరణం చాలా చల్లబడింది. రోడ్లమీద వరద నీరు ఎక్కువవుతోంది. జీహెచ్‌ఎంసి సిబ్బంది నాలాలను తెరుస్తున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -