end
=
Saturday, February 22, 2025
వార్తలురాష్ట్రీయంహైదరాబాద్‌లో తొలకరి జల్లు
- Advertisment -

హైదరాబాద్‌లో తొలకరి జల్లు

- Advertisment -
- Advertisment -

చిరు జల్లులతో హైదరాబాద్‌లో వాతావరణం చల్ల బడింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తీవ్ర వేడిమితో ఉన్న వాతవరణం ఒక్కసారిగా చల్లబడి చిరుజల్లులు కురిసింది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనివిధంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. జూన్‌ మాసం రానే వచ్చింది. అయినా కూడా వేడి గాలులు, రాత్రిపూట ఉక్కపోత తగ్గకపోవడంతో నిద్రలేమి రాత్రులు గడపాల్సి వచ్చింది. అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్‌ మొదటి వారంలోనే ఋతుపవనాలు వస్తాయన్న అంచనాలు నిజమై ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలో చిరు జల్లులు కురిశాయి. సికిందరాబాద్‌, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, తార్నాక, పారాడైజ్‌, బేంగంపేట, అమీర్‌పేట, తదితర ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వేసవి వేడిమి నుండి కొంత ఊరట కలిగింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -