న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో భారత్‌లో 46,232 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 564 మరణాలు సంభవించాయి. ఇండియా మొత్తంగా చూస్తే ఇప్పటివరకు కోవిడ్ పాసిటివ్ కేసుల సంఖ్య 91,50,598కి చేరింది. ఇందులో 4,39,747 యాక్టివ్ కేసులున్నాయి. 84,78,124 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 1,32,726కు చేరుకుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 10,66,022 కోవిడ్ టెస్టులు చేశారు. దీంతో కోవిడ్ టెస్టుల సంఖ్య దేశవ్యాప్తంగా 13,06,57,808కి చేరుకుంది.
అత్యధిక కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. అక్కడ 6,608 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో ఢిల్లీలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 40,936గా ఉంది. ఢిల్లీలో మొత్తం 5,17,238 కేసుల్లో 4,68,143మంది కోలుకున్నారు. 8,159 మంది మృత్యువాత పడ్డారు. కేరళలో ప్రస్తుతం 67,831 కోవిడ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహారాష్ట్రలో 5,640 కొత్త కేసులు వెలుగుచూశాయి.