end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంకన్నబిడ్డ చేతిలో తల్లి మృతి.....
- Advertisment -

కన్నబిడ్డ చేతిలో తల్లి మృతి…..

- Advertisment -
- Advertisment -

వ్యాపారం చేస్తూ తల్లి బిడ్డలని నిర్లక్ష్యం చేయరాదు. వ్యాపారం పోతే మళ్ళీ ఎలా అయిన సంపాదించవచ్చు. ప్రాణం పోతే రాదు అని మనం అర్దంచేసుకోవాలి. సమస్యలను ఇతరులతో పంచుకోవడం ద్వారా భారం దించుకోవడమో, కౌన్సెలింగ్‌ ద్వారా ఉపశమనం పొందడమో చేస్తుండాలి. కానీ, కొందరు అలాంటివేం చేయకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఓ తనయుడు కన్నతల్లినే హతమార్చిన సంఘటన.

గుజరాత్‌కు చెందిన మహేశ్‌పంచల్‌ కుటుంబం వర్ధమాన్‌ నగర్‌లో స్థిరపడింది. వ్యాపారం రిత్యా ఊళ్లు పట్టుకుని తిరుగుతుంటాడు మహేష్‌. మహేష్ కి ఇంజినీరింగ్‌ చదివే ఒక కొడుకు ఉన్నాడు అయితే తన మానసిక స్థిత్తి బాగోలేదు. ఒంటరితనం భరించలేక సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక సతమతమయ్యాడు. నిద్రలో ఉలిక్కిపడి లేచి విచిత్రంగా ప్రవర్తించడం చేస్తూ ఉండేవాడు. ఒక్క కొడుకు కావడంతో తల్లి ఛాయా పంచల్‌ ని గారాబంగా పెంచుతూ కంటికి రెప్పలా కాపాడుతూ వస్తోంది అతన్ని.

అయితే హఠాత్తుగా తనకు డబ్బు కావాలని, ఆస్తిలో వాటా పంచాలంటూ తల్లితో గొడవ ప్రారంభించాడు. ఈ క్రమంలో మానసిక ఆరోగ్యం బాగోలేని కొడుకును మందలిస్తూ వస్తోందామె. అయితే శనివారం రాత్రి తల్లి నిద్రలో ఉండగా కత్తితో గొంతుకోసి కిరాతకంగా చంపివేశాడు జయేశ్‌. తర్వాత తాను చేసిన తప్పు తనకి గుర్తించి ఐ లవ్‌యూ డాడీ అమ్మ చావుకు నేనే కారణం. నేనే చంపేశా. నన్ను క్షమించూ అంటూ గుజరాతీలో ఓ లేఖ రాసి ములంద్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర లోకల్‌ ట్రైన్‌ కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఛాయా ఒంటిపై 12 కత్తి పోట్లు ఉన్నాయని, కేసులో అనుమానితుడిగా భావిస్తున్న జయేష్‌ కోలుకుంటే తప్ప కేసు చిక్కుముడి వీడదని పోలీసులు చెప్తున్నారు. కన్నబిడ్డ చేతిలో భార్య మృతి చెందడంతో మహేశ్‌ పంచల్‌ చాలా బాదపడుతున్నాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -