-
నోటిపూత, నోట్లో పుండ్లకు ఇంటి చిట్కాలు
-
ఇక దానికి స్వస్తి చెప్పవచ్చు
నోటీ పూతతో బాధపడుతున్నారా.. అయితే ఇక దిగులే లేదు. ఎందుకంటే మన ఇంట్లోనే వాటిని తగ్గించుకోవచ్చు. అది ఎలా అంటారా! అదేనండి ఒకసారి కింది వాటిని క్లుప్తంగా చదివితే చాలు..
-
త్రిఫల చూర్ణం
త్రిఫల చూర్ణం అనేది ఆయుర్వేద నిపుణులకు బాగా తెలిసిన ఔషధ మూలికం. కొండ ఉసిరి, కరక్కాయ, తానికాయ అనే మూడు ఫలాలను కలిపి త్రిఫల చూర్ణం తయారుచేస్తారు. 1/2 టీస్పూన్ త్రిఫల చూర్ణాన్నిఒక కప్పు నీటితో కలిపి డికాషన్ తయారు చేయాలి. (tripal churnam) దీనిని రోజుకు ఒక్కసారి నోటితో పుక్కిలించాలి. 1-2 నిమిషాలపాటు నోట్లో పెట్టుకుని అనంతరం ఉమ్మి వేయాలని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు. త్రిఫల చూర్ణంలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వల్ల ఈ చూర్ణం వల్ల కడుపులో ఆకలి బాగా వేస్తుందని, పెద్ద పేగు శుభ్రపడుతుందని వారు చెబుతున్నారు.
-
పటికబెల్లం, కర్పూరం
8 గ్రాముల పటిక బెల్లం, ఒక గ్రాము కర్పూరం తీసుకుని వీటిని మెత్తగా పౌడర్ చేసి ఈ పొడిని నోటి పుండ్ల మీద రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమం నోటి పుండ్ల వల్ల కలిగిన వాపులను తగ్గిస్తుందన్నారు. సాధారణంగా పటికబెల్లంను మౌత్ ఫ్రెష్‌నర్‌గా ఉపయోగిస్తారు. (patikabellam) నోటిలో ఏర్పడే ఏదైనా వాపును తగ్గించడానికి దీనిని ఉపయోగిస్తారు. అటు నోటి పుండ్లను, నోటి పూతను తగ్గించడంలో కర్పూరం కూడా బాగా ప్రసిద్ధి చెందింది.
-
ములేటి పౌడర్
ములేతి పౌడర్‌ను చాలాకాలంగా ఆయుర్వేదంలో చాలా ఔషధ గుణాలకు ఉపయోగిస్తున్నారు. నోటిపుండ్ల వల్ల ఏర్పడే కడుపు రుగ్మతలకు ములేతి పౌడర్ అద్భుతంగా పనిచేస్తుంది. (Ayurvedam) ములేతి పౌడర్‌ను తేనెతో లేదా నీటితో కలిపి సేవించాలని, దీంతో నోటి అల్సర్లకు కారణమైన విషతుల్యాలను ఇది తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నోటి పుండ్లతో బాధపడేవారు తక్షణ ఉపశమనం పొందాలంటే ములేతి పౌడర్ ఉత్తమమైన ఔషధం
-
తులసి ఆకులు
ఔషధ గుణాలకు తులసి ఆకులు పెట్టింది పేరు. తులసి ఆకుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నోటి పుండ్లు ఉన్నవారు కొన్ని తులసి ఆకులు తీసుకుని బాగా నమలాలి. ఇలా చేయడం వల్ల తులసి (tulasi leaps) ఆకుల నుండి వచ్చే రసం నోటి పుండ్లను త్వరగా నయం అయ్యేలా చేస్తుంది. అలాగే ఒక గ్లాస్ నీటిలో తులసి ఆకులను ఉంచుకుని ఈ నీటిని తాగినా మంచి ఫలితం ఉంటుంది.
-
కొబ్బరినూనె లేదా నెయ్యి
కొబ్బరినూనెలో సహజంగా అనేక లక్షణాలున్నాయి. నోటిలో పుండ్లు ఏర్పడితే నెయ్యి లేదా కొబ్బరి నూనెను వాటి చుట్టూ రాసుకుని నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు నోటిలో నీరు ఊరటం జరుగుతుంది. అలా జరగగానే బయటకు ఉమ్మి వేయాలి. మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత నెయ్యి లేదా కొబ్బరి నూనె రాసుకోవాలి. (coconut oil) ఇలా చేయడం వల్ల నోటి పుండ్లు త్వరగా నయం అవుతాయి. ఇంకా ఏమైనా సందేహలు ఉన్నాయా.. అయితే కింద ఇచ్చిన నంబర్‌ను సంప్రదించండి. ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ వెంకటేశ్ 9392857411.