end

Aahwanam Resorts :ముఖ్యఅతిధిగా సినీ నటి ధమాక ఫేం శ్రీలీల..

హైదరాబాద్(Hyderabad) నగరంలో సినీ నటి ధమాక ఫేం శ్రీలీలా(Sri Leela) సందడి చేశారు. గచ్చిబౌలీ ఖానపూర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వజ్రా గ్రూప్స్(Vajra Groups)” ఆహ్వానం రిసార్ట్స్ పూజా కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్(Destination Wedding) కు ఈ ప్లేస్ అనుగుణంగా రూపొందించారని, ఈ నెల 25న రిలీజ్ అయ్యే ధమాక ఖచ్చితంగా ధమాక సృష్టిస్తుందని శ్రీలీల అన్నారు.ఈ రిసార్ట్స్ లో అతి పెద్ద లాన్, ట్రాన్స్పరెంట్ ఎసీ హాల్, పూల్ సైడ్ మినిలాన్, రిసోర్ట్స్ విత్ 50 రూమ్స్ అందుబాటులో ఉంటాయని ఆహ్వానం ఎండి అరుణ్ కుమార్(Arun Kumar) తడక తెలిపారు. వజ్ర ఇవెంట్స్ మూవీ ఇండస్ట్రీస్ లో సక్సస్ తో పాటు ఇప్పుడు హాస్పీటాలిటీ రంగంలో కూడా రాణిస్తూ “ఆహ్వానం రిసార్ట్స్ ప్రారంభించామని మేనేజింగ్ డైరెక్టర్(Managing Director) అరుణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీనటీ శ్రీలీలతో పాటు ఎండి అరుణ్ కుమార్, కౌన్సిలర్ అమరేంధర్ రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Exit mobile version