- హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
దేశంలో, రాష్ర్టంలో కరోనా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. చాలా మంది రాజకీయ నాయకులు, సినీమా సెలబ్రెటీలు కూడా కోవిడ్ వల్ల మృత్యువాత పడుతున్నారు. తాజాగా తెలంగాణలోని టీఆఎర్ఎస్ ఎంపీ రాములు కూడా కోవిడ్ బారిన పడినట్లు ఆయనే స్వయంగా తెలిపారు. కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తనతో పాటు దగ్గర కాంటాక్టులు ఉన్నవారందరూ కచ్చితంగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, అలాగే 15 రోజులపాటు హోం క్యారంటైన్‌లో ఉండాలని ఆయన కోరారు.
ఇదిలావుండగా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, హైదరాబాద్ మేయర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరిలో ఉన్నారు. మంత్రి హరీశ్ రావు కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం అందిరికీ విధితమే.