end
=
Friday, April 18, 2025
సినీమామృణాల్ `కాస్మోపాలిట‌న్` సోయ‌గాలు.. క్రేజీ క‌వర్ పేజీ
- Advertisment -

మృణాల్ `కాస్మోపాలిట‌న్` సోయ‌గాలు.. క్రేజీ క‌వర్ పేజీ

- Advertisment -
- Advertisment -

`సీతారామం`, `హాయ్ నాన్న‌` వంటి చిత్రాల‌తో మృణాల్ ఠాకూర్(Mrinal Takur) తెలుగు ప్రేక్ష‌కుల‌(Tollywood Audience)ను అల‌రించింది. మహారాష్ట్రలో జన్మించిన మృణాల్ తొలిరోజుల్లో బుల్లితెర‌పై క‌నిపించింది. చిన్న కార్య‌క్ర‌మాల్లో గెస్ట్ రోల్ ప్లే చేసేది. త‌ర్వాత చిత్ర రంగంలోకి ప్ర‌వేశించింది. బాలీవుడ్‌లో 2018 నుంచి 2021 వరకు వ‌రుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. కానీ.. తెలుగులో వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. హిందీలో స‌రైన బ్రేక్ రావ‌డం లేద‌ని వెనుకాడుతున్న కాలంలో తెలుగులో `సీతారామం` చిత్రంతో మంచి బ్రేక్ వ‌చ్చింది. సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో టాప్‌ స్టార్ అయింది. సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫాం అయిన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఏకంగా ఈమెకు 14 మిలియన్ల‌ ఫాలోవర్స్ ఉండ‌గా, ఎప్ప‌టిక‌ప్పుడు మృణాల్ త‌న సినిమాల అప్‌డేట్ ఇస్తూ వ‌స్తుంది. ప్రముఖ మ్యాగజైన్‌(Magazine)లపైనా చిత్రించిన ఆమె ఫొటోల‌ను షేర్ చేస్తుంది. తాజాగా ఆమె కాస్మోపాలిటన్ ఇండియా మ్యాగజైన్‌ కోసం కవర్ ఫోటో(Cover Photo)కు స్టిల్స్ ఇచ్చింది. తెలుపు వ‌స్త్రాల్లో ఆమె త‌ళుక్కుమంది. ఆ చిత్రాన్ని చూసి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం తెలుగులో ఈమె అడవి శేష్‌తో కలిసి `డెకాయిట్‌` అనే చిత్రంలో న‌టిస్తున్న‌ది.సినిమా కోసం ఆమె ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే కాక‌ మృణాల్ హిందీలో సన్నాఫ్ సర్దార్‌, పూజా మేరీ జాన్‌, హై జవానీ తో ఇష్క్ హోనా హై, తుమ్ హో తో సినిమాల్లోనూ న‌టిస్తున్న‌ది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -