end
=
Friday, November 22, 2024
క్రీడలుముంబై మెస్మరైజింగ్ విక్టరీ
- Advertisment -

ముంబై మెస్మరైజింగ్ విక్టరీ

- Advertisment -
- Advertisment -
  • 10 వికెట్లతో సీఎస్‌కేపై ఘనవిజయం
  • అదరగొట్టిన ఓపెనర్లు డీకాక్‌, కిషన్‌
  • టోర్నీలో చెన్నై ఖేల్‌ ఖతం
  • పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన ముంబై

ఏపీ ఉద్యోగులకు‌ తీపి కబురు

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో డిపెండింగ్‌ ఛాంపియన్‌ ముంబైని, చెన్నై 5 వికెట్ల తేడాతో ఓడించింది. అందుకు బదులుగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై, ముంబై జట్టు గట్టిగానే బదులు తీర్చుకుంది. ఏకంగా 10 వికెట్ల తేడాతో, 12.2 ఓవర్లలోనే ఘనవిజయం సాధించింది. 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. ఓపెనర్లు క్వింటన్‌ డీకాక్‌(37 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌(37 బంతుల్లో 68; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడి, జట్టుకు మరుపురాని విజయాన్ని అందించారు.

రైతులకు ప్రభుత్వమే అండగా ఉండాలి

ఈ సీజన్‌లో 10 వికెట్లతో విజయం సాధించడం ముంబైకే చెల్లింది. ముఖ్యంగా ఇషాన్‌ కిషన్‌ సీఎస్‌కే బౌలర్లపై ధనాధన్ షాట్లతో విరుచుకుపడ్డాడు. బౌండరీలు, సిక్సులే లక్ష్యంగా చేసుకొని బౌలర్లపై ఎదరుదాడి చేశాడు.అంతకు ముందు టాస్‌ ఓడి, బ్యాటింగ్‌ చేసిన చెన్నై ఆది నుంచే తడబడింది. ముంబై బౌలర్ల ధాటికి ఖాతా తెరకుండానే వికెట్ కోల్పోయిన సీఎస్‌కే.. 30 పరుగులకే ధోనీ సహా 6 వికెట్లు కోల్పోయింది. ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ (52) అర్ధసెంచరీతో రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

టీఆఎర్‌ఎస్‌ ఎంపి రాములుకు కరోనా పాజిటివ్‌

చెన్నై జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్‌ మాత్రమే రెండంకెల మార్కును అందుకున్నారు. మిగితా బ్యాట్స్‌మెనంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. 4 వికెట్లతో రాణించిన ముంబై ఫాస్ట్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్ లేకుండానే ముంబై ఇంతటి ఘన విజయం సాధించడం ఆ జట్టుకు శుభపరిణామం.

వినియోగదారులకు పేటిఎం షాక్‌

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -