end

ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై..

  • అదరగొట్టిన సూర్యకుమార్‌, బుమ్రా

ఐపీఎల్‌లో ప్లే ఆఫ్‌కు చేరిన మొదటి జట్టుగా ముంబై నిలిచింది. 12 మ్యాచులాడిన ముంబై 8 విజయాలతో, 16 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్‌కు చేరుకుంది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచులో ఆ జట్టు.. ఆర్సీబీపై మరో ఐదు బంతులు మిగిలుండగానే, 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట టాస్‌ గెలిచిన ముంబై.. ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. 165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19.1 ఓవర్లలో విజయం నమోదు చేసింది.

రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు

తద్వారా ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా అవతరించింది. ముంబై బ్యాట్స్‌మెన్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌(43 బంతుల్లో 79 పరుగులు; 10 ఫోర్లు, 3 సిక్సులు) తన సూపర్‌ బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మైదానం నలువైపులా చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. ఓపికగా ఆడి ముంబైకి ఘనవిజయాన్ని అందించాడు. ఓపెనర్లు డీకాక్‌(18 పరుగులు), ఇషాన్‌ కిషన్‌(25 పరుగులు), ఆల్‌ రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా(17 పరుగులు) పర్వాలేదనిపించారు. బెంగుళూరు బౌలర్లలో చాహల్‌, సిరాజ్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మోరిస్‌ ఓ వికెట్ తీశాడు.

ధరణి పోర్టల్ షురూ..

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టు.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి, 164 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిలిప్‌(24 బంతుల్లో 33 పరుగులు; 4 ఫోర్లు, 1సిక్సర్‌), దేవదూత్‌ పడిక్కల్‌(45 బంతుల్లో 74 పరుగులు; 12 ఫోర్లు, 1సిక్సర్‌) అద్భుతంగా రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 7.5 ఓవర్లలోనే 71 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఈ జంటను రాహుల్‌ చాహర్‌ విడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ కోహ్లి 9 పరుగులకే పెవిలియన్‌ చేరాడు.

ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌: ప్రధాని

బుమ్రా వేసిన బౌన్సర్‌ను షాట్ ఆడబోయిన కోహ్లి.. తివారికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఏబీ కూడా 15 పరుగులకే ఔటయ్యాడు. బెంగుళూరు జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించినా.. మిగితా బ్యాట్స్‌మెన్‌ ను క్రీజులో నిలదొక్కునీయకుండా ముంబై బౌలర్లు సక్సెస్‌ అయ్యారు. బుమ్రా 4 ఓవర్లు వేసి ఓ మెయిడిన్‌తో పాటు 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్‌, రాహుల్‌ చాహర్‌, పొలార్డ్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

బ్యాంకు దొంగల అరెస్ట్‌..

Exit mobile version