end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంటీఆర్ఎస్‌కు ‘మునుగోడు’ రచ్చ
- Advertisment -

టీఆర్ఎస్‌కు ‘మునుగోడు’ రచ్చ

- Advertisment -
- Advertisment -

మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ స్థానం దక్కించుకునేందుకు బీజేపీతోపాటు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మునుగోడులో గెలుపు అన్ని పార్టీలకు కీలకంగా మారింది. అందుకే ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ అనేక వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. అయితే అందులో కీలకమైన అభ్యర్థి ఎంపిక విషయం ఇప్పుడు ఆ పార్టీకి కొత్త తలనొప్పిని తీసుకొచ్చేలా ఉందనే చర్చ జరుగుతోంది. మునుగోడులో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలనే దానిపై టీఆర్ఎస్ సతమతం అవుతుంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మళ్లీ అవకాశం ఇవ్వాలా ? లేక కర్నె ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్ లేక మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌కు అవకాశం ఇవ్వాలా ? అనే అంశంపై అంతర్గతంగా సర్వేలు కొనసాగిస్తున్నారు.

అయితే ఈ విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్ నాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని సమాచారం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ భావించిందని ఇదే విషయాన్ని అక్కడి స్థానిక నేతలకు చెప్పి ఒప్పించాలని జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు ఫలించాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ మునుగోడుకు తిరిగొచ్చిన టీఆర్ఎస్ నేతలు చౌటుప్పల్ నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని మరోసారి తీర్మానం చేశారు.ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఉప ఎన్నికల్లో పార్టీ గెలవదని హెచ్చరించారు. దీంతో టీఆర్ఎస్ నాయకత్వానికి మునుగోడులో అభ్యర్థి ఎంపిక అంత తేలిక కాదనే చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ నాయకత్వం మాత్రం మునుగోడు టికెట్‌ను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే ఇవ్వాలని నిర్ణయించుకుందని పార్టీలో టాక్ వినిపిస్తోంది.ఈ విషయంలో నిర్ణయాధికారం కేసీఆర్‌కు అప్పగించేవాళ్లు, కానీ మునుగోడు విషయంలో మాత్రం టీఆర్ఎస్‌లో వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -