- సీఎం కేసీఆర్‌నిర్ణయం
Munugodu By Elections : మనుగోడు ఉప ఎన్నిక కోసం పలు పార్టీలు అభ్యర్థుల కోసం సుదీర్ఘ చర్చలు, సమావేశాలు జరుపుతున్నారు. అయితే టీఆర్‌ఎస్(TRS) పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్‌రెడ్డిని(Kusukuntla Prabhakar Reddy) అభ్యర్థిగా సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. 2014లో టీఆర్‌ఎస్ తరపున ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా(Ex MLA) విజయం సాధించిన విషయం తెలిసిందే. తర్వరలో జరగనున్న మనుగోడు ఉప ఎన్నికకు (Munugode Elections) ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం(Election Comision) షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే మనుగోడు టికెట్టు కోసం పలు టీఆర్‌ఎస్ సీనియర్ నేతలు ప్రయత్నించగా పార్టీ అధిష్టానం కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఎంపిక చేస్తూ నిర్ణయించింది. కాగా మనుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు సవాల్‌గా మారింది. ఎలాగైనా మనుగోడు ఎమ్మెల్యే సీటును దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజెపీ, టీఆర్‌ఎస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
(Munugode Elections : కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి)