end
=
Wednesday, January 22, 2025
క్రీడలుక్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలి
- Advertisment -

క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలి

- Advertisment -
- Advertisment -
  • ఆసీస్‌ క్రికెటర్లకు కోచ్‌ లాంగర్‌ సూచన

సిడ్నీ: భారత్‌తో‌ జరిగే సుదీర్ఘ సిరీస్‌లో‌ ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆస్ట్రేలియా జట్టు హెడ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ సూచించారు. స్లెడ్జింగ్‌ పేరిట హద్దులు దాటి ప్రవర్తిస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన తమ ఆటగాళ్లకు హితవు పలికాడు. మ్యాచ్‌ మధ్యలో సరదా సంభాషణలకు చోటు ఉంటుందని, పోటీతత్వంతో ముందుకు సాగాలే తప్ప అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు లాంగర్‌.

కాగా, ఆస్ట్రేలియా జట్టు అంటేనే స్లెడ్జింగ్‌కు పెట్టింది పేరన్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల దృష్టి మరల్చేందుకు మాటల యుద్ధానికి దిగుతూ వారిని మానసికంగా దెబ్బకొట్టడం ఆసీస్‌ క్రికెటర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం ద్వారా గతంలో వారు అనేక విజయాలు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో బాల్‌ టాంపరింగ్‌ వివాదం తర్వాత ఆసీస్‌ ఆటగాళ్లు కాస్త దూకుడు తగ్గించారని చెప్పొచ్చు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -