end
=
Sunday, January 19, 2025
సినీమానా తొలి జీతం 736 రూపాయలు
- Advertisment -

నా తొలి జీతం 736 రూపాయలు

- Advertisment -
- Advertisment -

తమిళ్‌ సినిమాలతో తన ప్రయాణం మొదలు పెట్టిన హీరో సూర్య సౌతిండియా స్టార్‌గా ఎదిగాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ అతి తక్కువ సమయంలో స్టార్‌డమ్‌ క్రియేట్ చేసుకున్నాడు. ఇటీవల సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ సోషల్ మీడియాలో రిలీజై చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని తన పాత్ర నా వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా ఉందని సూర్య చెప్పాడు. నాన్న సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. తమ కాళ్లపై తామే నిలబడాలని ఇంట్లో భావించారు. దీంతో డిగ్రీ పూర్తి కాగానే ఓ బట్టల పరిశ్రమలో ఉద్యోగంలో చేరాను. అక్కడ నా నెల జీతం రూ. 736. అదే నా మొదటి సంపాదన. ఈ మూవీ సమయంలో నాకు అలనాటి రోజులు గుర్తుకొచ్చాయి. అందుకే హావభావాలు సరిగ్గా పలికించగలిగానని ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో సూర్య వెల్లడించాడు.

అనంతరం సినిమాల మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చానన్నారు. తొలుత సెకండ్ హీరో, సైడ్‌ క్యారెక్టర్లు చేసిన సూర్య ఆనతి కాలంలోనే స్టార్‌ హీరోగా ఎదిగాడు. స్టార్‌ డైరెక్టర్లతో పనిచేసే స్థాయికి ఎదిగాడు. ఒకానొక సమయంలో ఆయన కాల్షీట్లు కూడా లభించేవి కావు. కాగా, ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే.. తనతో కలిసి 7 సినిమాలు చేసిన హీరోయిన్‌ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. త్వరలో వీరిరువురి కలయకలో మరో మూవీ రాబోతోంది. సూర్య తమ్ముడు కార్తీ కూడా హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -