end

Geetha Devi:నా తల్లి ఒక ఉక్కు మహిళ

  • నిస్వార్థ ప్రేమ, అంకితభావం సాటిలేనిది
  • మనోజ్ బాజ్ పాయ్ ఎమోషనల్ నోట్ వైరల్

ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయి(Manoj Bajpayee) తన తల్లి గీతా దేవి(Geetha Devi) మరణాన్ని తలచుకుంటూ భావోద్వేగానికి(Emotional) లోనయ్యాడు. ఇటీవల ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పిస్తూ తాజాగా నెట్టింట సుదీర్ఘమైన నోట్‌ను షేర్ చేశాడు. తన మాతృమూర్తిని ఉక్కు మహిళగా పేర్కొన్న ఆయన.. ‘ఒక ఐరన్ లేడీ.. నా తల్లికి నివాళి(An Iron Lady.. a tribute to my mother)! నేను ఆమెను అలాగే పిలుస్తాను. ఆరుగురు పిల్లల తల్లితోపాటు అత్యంత పెద్దమనిషికి భార్య. ఆమె తన కుటుంబంపై చెడు కళ్లు పడకుండా జాగ్రత్తగా రక్షించింది. ఈ క్షమించరాని ప్రపంచానికి తన సొంత కలలను త్యాగం చేస్తూ ప్రతి బిడ్డ అవసరాలను తీర్చడంలో తన భర్తకు మద్దతుగా నిలిచింది. ఆమె ఒక ఆల్ఫా మహిళ. నా తల్లి మేము అద్భుతమైన ధైర్యవంతులుగా ఎదగడాన్ని చూడటానికి మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నా. ఆమెకు ఎప్పటికైనా రుణపడి ఉంటా. ఆమె నిస్వార్థ ప్రేమ(Selfless love) & అంకితభావం సాటిలేనిది. నేను జీవితంతో పోరాటం చేస్తున్న రోజుల్లో ఆమె తిరుగులేని మద్దతు, శక్తిని ఇచ్చింది. ప్రోత్సాహం, మాటలు ఎల్లప్పుడూ నాతో ఉంటాయి. అమ్మ అందించిన స్ఫూర్తిని నా పిల్లలకు అందిస్తాను. నేను ఆమె ప్రతిబింబం’ అని వివరించాడు.

అలాగే అత్యంత బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొని, సూర్యుడు అస్తమించే వరకు దానితో పోరాడాల్సిన విలువను తల్లి తనకు నేర్పిందని చెప్పాడు. అంతేకాదు ఆమె ప్రయత్నాలు, త్యాగాలు(Sacrifice), నిస్వార్థ ప్రేమ, కృషి అడుగడుగునా తమకు మార్గదర్శక శక్తిగా కొనసాగుతాయన్నాడు. ‘మీరు- బాబూజీ ఎల్లప్పుడూ మా హృదయాలలో ఉంటారు. నా తల్లిగా నేను నిన్ను కలిగి ఉండటం, నీ ఆశీర్వాదం అందుకోవడం అదృష్టవంతుడినే. మనం మళ్లీ కలుసుకునే వరకు ఓం శాంతి’ అని మనోజ్ ముగించాడు. ప్రస్తుతం ఈ నోట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు, సెలబ్రిటీలు తమదైన స్టైల్‌లో సోషల్ మీడియా(Social Media) వేదికగా నివాళి అర్పిస్తున్నారు.

(Leukemia:ప్రపంచలోనే మొదటి సారి)

Exit mobile version