end

Arjun Kapoor:నా సోదరి జాన్వీకి ఆ లక్షణాలు లేవ్..

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తన చెల్లెలు జాన్వీకపూర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల సినిమాల కంటే మలైకా అరోరాతో ప్రేమాయణంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు అర్జున్. ఈ కుర్ర నటుడు నటించిన తాజా బాలీవుడ్ (Bollywood) చిత్రం ‘కుత్తే’ ఇటీవలే విడుదలైంది. ఈ తరుణంలో జరిగిన ప్రమోషనల్ కార్యక్రమంలో ఈ యువ నటుడు తన సవతి చెల్లెలు, దివంగత అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. ‘జాన్వీకి అభద్రతాభావం ఎక్కువ. భయం, ఆందోళన ఎక్కువ. తన సామర్థ్యంపై తనకి నమ్మకం ఉండదు. ఆమె ఎవరి కూతురనే దాని మరిచిపోయి చాలా సాధారణంగా ఉంటుంది. నిజానికి అది చాలా ముఖ్యం కూడా. అందుకే ఆమె ఎంపిక చేసే మూవీస్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దానికి కారణం తను కొత్తరకం సినిమాలు చేయడానికి సిద్ధపడడమే’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. జనవరి 13న విడుదలైన ‘కుత్తే’ (Kuttey)కి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఇప్పటివరకూ కేవలం 3.5 కోట్ల వసూళ్ల సాధించగలిగిందని తెలుస్తోంది. ఈ చిత్రంలో టబు, నసీరుద్దీన్ షా, కొంకణ్ సేన్ శర్మ, శార్ధూల్ భరద్వాజ్, రాధికా మదన్ కీలక పాత్రల్లో నటించారు.

(Mithila Parker:హీరోయిన్లకు ఇది స్వర్ణయుగమే)

Exit mobile version