end
=
Saturday, September 21, 2024
వార్తలుజాతీయంMyanmar crisis:మయన్మార్‌ సంక్షోభం భారత్‌కు ఎఫెక్ట్..
- Advertisment -

Myanmar crisis:మయన్మార్‌ సంక్షోభం భారత్‌కు ఎఫెక్ట్..

- Advertisment -
- Advertisment -
  • మయన్మార్‌లో చెలరేగుతున్న ప్రాంతీయ సంక్షోభం
  • ఇండియాపై ప్రభావం ఉంటుందనే పరిణామాలు

సైన్యం దాడులు, ప్రజల తిరుగుబాట్లతో అతలాకుతలమవుతున్న మయన్మార్‌ (Myanmar) భవిష్యత్తుపై చర్చించడానికి ఆసియన్ (asia countries)దేశాల విదేశీ మంత్రులు తాజాగా ఇండోనేషియా (Indonesia) రాజధాని జకార్తా (Jakarta)లో సమావేశమయ్యారు. 2021 ఫిబ్రవరిలో ప్రజాస్వామికంగా ఎన్నికైన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ (National League for Democracy Party) ప్రభుత్వాన్ని కూలదోసి మయన్మార్‌ని సైనిక జుంటా కైవసం చేసుకుని దాదాపు 20 నెలలు కావస్తోంది. కానీ దేశవ్యాప్తంగా తన నియంత్రణను ఏర్పర్చుకోలేని సైనిక జుంటా ఆయుధాలతో ప్రజా తిరుగుబాట్లను అణిచివేయాలని చూస్తోంది. ప్రవాసంలో స్వయం ప్రకటిత జాతీయ ఐక్యతా ప్రభుత్వంతో పొత్తు కలిపిన మయన్మార్ గిరిజన సాయుధ సంస్థలు, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (People’s Defense Force)అని పిలుస్తున్న సాయుధ పౌర బృందాలు కలిసి సైనిక జుంటాపై పోరాడుతున్నాయి. నవంబర్ 10 నుంచి 13 వరకు కాంబోడియాలో ఆసియన్, తూర్పు ఆసియా సదస్సులు జరగనున్న నేపథ్యంలో జకార్తాలో ఆసియన్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. మయన్మార్‌లో చెలరేగుతున్న ప్రాంతీయ సంక్షోభంతో ఎలా వ్యవహరించాలి అనే విషయమై సభ్యదేశాలు కనీవినీ ఎరుగని విభేదాలను వ్యక్తం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. మయన్మార్‌లో కొనసాగుతున్న సంక్షోభం ఏదో ఒకరకంగా తమనూ ప్రభావితం చేస్తుందని ఈ దేశాలు భయపడుతున్నాయి. భారత్‌ని కూడా మయన్మార్ సంక్షోభం తాకిడిని త్వరలోనే ఎదుర్కోవలసి ఉంటుందని పరిణామాలు సూచిస్తున్నాయి.

మయన్మార్‌లో ప్రజాస్వామ్యానికి (democracy)కలుగుతున్న అంతరాయం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం, అదేసమయంలో కీలకమైన దేశీయ ప్రయోజనాల కోసం మయన్మార్ సైనిక జుంటాతో ఏదో ఒకరకంగా అంటకాగడం అనే సన్నటి తీగపై భారత్ (india)ప్రమాదకరమైన కసరత్తు చేస్తోంది. మయన్మార్ జుంటా నుంచి తానాశిస్తున్న ఆ కీలకమైన ప్రయోజనాలు నిజంగా నెరవేరతాయా అని భారత్ వెనక్కు తిరిగి చూసుకుంటే బాగుండేది. సైనిక జుంటాతో సఖ్యత పాటించడం ఎందుకు అవసరమో భారత్ కొన్ని బలమైన కారణాలు చూపుతోంది. ఈశాన్య భారత్ భద్రతకు ఇది హామీ ఇస్తుందని భారత్ భావిస్తోంది. ఈ కారణంతోనే మయన్మార్ తిరుగుబాటు బృందాలకు అవకాశం కల్పించవద్దని భారత్ తన సైనిక జనరల్స్‌ (Military generals)కి ఆదేశాలిచ్చింది.

(Munugode:మునుగోడు కేసీఆర్ బహిరంగ సభపై సర్వత్ర ఉత్కంఠ..)

మయన్మార్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న మిజోరాం (Mizoram)లోకి శరణార్థులు వెల్లువలా వచ్చి పడతారన్నదే భారత్ ప్రధాన ఆందోళన. మయన్మార్‌తో భారత్ 1,643 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)నుంచి మిజోరా వరకు వ్యాపించి ఉంది. ఇక్కడే చైనా, బంగ్లా (China, Bangladesh)దేశ్‌లతో కూడా భారత్ సరిహద్దులను కలిగి ఉందని గమనించాలి. మయన్మార్ గిరిజనులు, వారి కుటుంబ బంధాలను అంతర్జాతీయ సరిహద్దులో నిశితంగా పరిశీలించడానికి భారత్ సరిహద్దు నియంత్రణలను తీసుకొచ్చింది. స్వేచ్ఛా ప్రయాణ వ్యవస్థ అమల్లో ఉన్నప్పుడు రెండు దేశాల సరిహద్దుల్లో 16 కిలోమీటర్ల భూభాగంలో అటూ ఇటూ జీవిస్తున్న పౌరులు పరస్పరం సరహద్దులు దాటి రెండు వారాల పాటు ఉండిపోవడానికి అవకాశం ఉండేది.

మిజోరంలో అధికారికంగా నమోదైన మయన్మార్ శరణార్థుల సంఖ్య 30 వేలు. వీరు ప్రధానంగా చిన్ (chin)రాష్ట్రం నుంచి వచ్చినవారు. అయితే ఇంకా కొన్ని వేలమంది శరణార్థులు తన పేర్లను నమోదు చేసుకోలేదు. ఎన్డీయే (NDA)భాగస్వామ్య పార్టీ అయిన మిజో నేషనల్ ఫ్రంట్‌ (Mizo National Front)కి చెందిన రాష్ట్ర ముఖ్య మంత్రి జొరామ్‌తంగ (Zoramthanga)శరణార్థుల విషయంలో కేంద్రప్రభుత్వంతో బాహాటంగా విభేదించారు. నిజానికి భారత్ 1951 నాటి ఐక్యరాజ్యసమితి (United Nations) రెఫ్యూజీ కన్వెన్షన్‌ని కానీ, దాని 1962 ప్రోటోకాల్‌ని కానీ ఆమోదించి సంతకం పెట్టలేదు. పైగా శరణార్థులపై దేశీయ విధానం కూడా మనకు లేదు.

మయన్మార్ లోని చిన్ రాష్ట్రం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున భారత్‌లోకి వస్తున్నప్పుడు, ఈ అక్రమ వలసలను అడ్డుకోవాలని కేంద్ర హోం శాఖ ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది. కానీ మిజోరాం సీఎం మాత్రం మయన్మార్ ప్రజలకు సంఘీభావం తెలిపారు. పైగా శరణార్థులకు స్వాగతం (WELCOME)పలకడం కొనసాగించారు. అయితే పెరుగుతున్న శరణార్థుల సంఖ్య రాష్ట్ర వనరులపై భారం వేస్తోంది. దీంతో పలు ఎన్జీవోలు, (Ngo) చర్చి, యువజన సంఘాలు శరణార్థులకు సాయం చేసే పనిలో భాగమయ్యారు. శరణార్థులకు మిజోరం ప్రభుత్వం (government)సాయం చేయడాన్ని కేంద్రం ఇంతవరకు నిరోధించలేదు.

సైనిక కుట్ర, కొనసాగుతున్న అశాంతి అనేవి మయన్మార్‌లో భారత్ ప్రాజెక్టులను (project)పెండింగులో పెట్టాయి. థాయ్‌లాండ్ (Thailand)వరకు త్రైపాక్షిక హైవే, (hiway)కలాదన్ వాటర్ వే ప్రాజెక్టు (Kaladan Water Way)వంటి భారత్ చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పటికే గడువు తేదీలను దాటిపోయాయి. వీటి నిర్మాణం ఎప్పుడు ముగిసిపోతుందో కూడా తెలీటం లేదు. అయితే శరణార్థుల ప్రవాహం మోతాదుకు మించి వెల్లువెత్తిన పక్షంలో మయన్మార్ సైనిక జుంటాతో కూడా భారత్ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే మయన్మార్ సంక్షోభం భారత్ తలుపులు తట్టడానికి సిద్ధంగా ఉంది. అటు ప్రజాస్వామ్య పరిరక్షణ, ఇటు సైనిక జుంటాతో సంబంధాల కొనసాగింపు అనే సన్నటి రేఖపై భారత్ చాలా జాగ్రత్తగా అడుగులేయవలసి ఉందని స్పష్టమవుతోంది.

ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రద్దు చేసిన మయన్మార్ జుంటాపై ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూకే, యూరోపియన్ యూనియన్‌ (Australia, Canada, USA, UK, European Union)లు ఆంక్షలు విధించాయి. కానీ ఉక్రెయిన్ (Ukraine) యుద్ధంలో నిండా చిక్కుకుపోయిన పాశ్చాత్య దేశాలు మయన్మార్‌ను సైనిక జుంటానుంచి ఎలా బయటపడాలో తేల్చుకోలేకపోతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధ సందర్భంలో ఐక్యంగా ఉంటున్న రష్యా, (russia)చైనాలు మయన్మార్‌కు మద్దతుగా నిలబడ్డాయి. ఆసియన్ దేశాలు కూడా మయన్మార్ సంక్షోభ పరిష్కారంలో విఫలమైనట్లు కనిపిస్తున్నాయి కానీ రీజియనల్ పరిష్కారం సాధ్యపడుతుందని ఇప్పటికీ ఈ దేశాలు నమ్ముతున్నాయి. మయన్మార్‌లో కాల్పుల విరమణ, సంబంధిత పార్టీల మధ్య చర్చలు, ఆసియన్ దేశాల ప్రత్యేక దూత మధ్యవర్తిత్వం, మానవతావాద సహాయం అందించడం, సంబంధిత పార్టీలన్నింటితో సమావేశం కావడానికి ఆసియన్ ప్రత్యేక దూత మయన్మార్‌ని సందర్శించడం అనే పంచ సూత్రాలను (five principles)పరిష్కార మార్గంగా ఆసియన్ కూటమి భావిస్తోంది.

(TRS MLA Money Offer : ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి ప్రత్యేక భద్రత)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -