end

Nagoba jatara:ఘనంగా ప్రారంభమైన నాగోబా జాతర!

అడవి బిడ్డల నాగోబా జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం (A reflection of the culture and traditions of the tribals) ఈ నాగోబా జాతర. మెస్రం వంశీయులు (Descendants of Mesram) నాగోబా మహాపూజలకు ఉదయం 11 గంటల నుంచి శ్రీకారం చుట్టగా శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగించారు. ఆదిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్‌ గ్రామంలో (Keslapur village of Adilabad district) అడవిబిడ్డల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. శనివారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు చేపట్టిన మహాపూజలతో వేడుక మొదలైంది. ఈ నెల 17న ఇంద్రవెల్లి మండల (Indravelli Mandal) కేంద్రంలోని ఇంద్రాయి దేవతకు పూజలు చేసి కేస్లాపూర్‌లోని మర్రి చెట్ల వద్దకు చేరిన మెస్రం వంశస్థులు.. ఆ చెట్ల నీడలో గంగాజలంతో మూడురోజుల పాటు వివిధ సంప్రదాయ పూజలు చేశారు. శనివారం ఉదయం అక్కడి నుంచి వెండి విగ్రహం, పూజా సామగ్రిని తీసుకొని డోలు, కాలికోమ్‌ వాయిద్యాలతో ప్రదర్శనగా ఆలయానికి చేరుకున్నారు. గంగాజలంతో ఆలయాన్ని శుభ్రపరిచి, నాగోబాకు అభిషేకం చేశారు.

గోవాడ్‌లో మహిళలు 22 ప్రత్యేక పొయ్యిలను ఏర్పాటు చేసుకొని మహాపూజలకు అవసరమైన నైవేద్యాన్ని సామూహికంగా తయారు చేశారు. మెస్రం వంశ సంప్రదాయం ప్రకారం మహాపూజలకు అరగంట ముందు నాగోబా ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మెస్రం వంశీయులు గోవాడ్‌ నుంచి వెలిగించిన కాగడాలను చేతిలో పట్టుకొని సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 12 గంటల వరకు మెస్రం వంశీయులే నాగోబాకు మహాపూజలు చేశారు. ఈ సమయంలో ఇతరులను లోనికి రానివ్వకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. పూజల అనంతరం వచ్చిన అతిథులతోపాటు ఇతరులను నాగోబాకు పూజలు చేసే అవకాశం కల్పించారు. ఈ నెల 28 వరకూ జాతర కొనసాగనుంది. ఆదివాసీల అతిపెద్ద జాతర కేస్లా పూర్ నాగోబా జాతర వైభవంగా సాగుతోంది. జాతర కోసం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ పలువురు కేంద్రమంత్రులు నాగోబాను దర్శించుకోనున్నారు. ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగానే కాకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు.

ఇక నాగోబా జాతర ప్రత్యేకత విషయానికి వస్తే గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా జరగనున్న ఈ జాతరలో శనివారం సాయంత్రం ఎడ్ల బండ్లతో గోవాడ్ కు చేరుకుంటారు. ఆపై నాగోబా ఆలయాన్ని పవిత్ర గంగాజలంతో శుద్ధి చేసి , ఆపై ప్రత్యేక పూజలు చేసి ఏడు రకాల పాము పుట్టలను తయారుచేసి వాటికి ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. దీంతో నాగోబా అనుగ్రహం కలుగుతుందని మెస్రం వంశీయులతోపాటుగా, ఆదివాసీలు విశ్వసిస్తారు. నాగోబా జాతర చరిత్ర ఇదే ఇక నాగోబా జాతర నిర్వహణకు సంబంధించిన చరిత్ర విషయానికి వస్తే క్రీస్తు శకం 740లో కేస్లాపూర్ గ్రామ గిరిజనుడు పడియేరు శేష సాయి నాగలోకానికి వెళ్తాడు. అక్కడ నాగరాజు లేకపోవడంతో నిరుత్సాహంతో శేష తల్పం తాకి కేస్లాపూర్ కు వెనుదిరుగుతాడు. ఇక శేషతల్పాన్ని మానవుడు తాకిన విషయం తెలుసుకున్న నాగేంద్రుడు (Nagendrudu) ఆగ్రహంతో శేష సాయిని అంతమొందించటానికి భూలోకానికి వస్తాడు. ఈ విషయం తెలిసిన శేష సాయి ఏడు కడవల ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు, (Cow milk, curd, ghee, honey, jaggery, fenugreek,) తదితర ఏడు రకాల నైవేద్యంతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు.

గోదావరి, హస్తలమడుగు నీటిని 125 గ్రామాల మీదుగా తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేస్తాడు. ఇక దీంతో సంతృప్తి చెందిన నాగరాజు కేస్లాపూర్ వద్ద ఉన్న పుట్టలోకి వెళ్లి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకొని అప్పటినుంచి పూజలు అందుకుంటూ ఉంటాడు. నాగోబా జాతరలో దర్బార్ ది ప్రత్యేకమైన స్థానం ఇక అప్పుడు మొదలైన నాగోబా జాతర అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. ఇక నాగోబా జాతరలో నిర్వహించే ప్రజా దర్బార్ కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. నాగోబా జాతరలో దర్బార్ ను 77 ఏళ్ల క్రితం నుండి నిర్వహిస్తున్నారు. ఇక ఈ దర్బార్లో నేటికీ గిరిజనుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ఎన్నో విశేషాలు ఉన్న గిరిసీమలో కేస్లాపూర్ నాగోబా జాతర సందడి మొదలైంది. తమ ఆరాధ్యదైవం నాగోబాను దర్శించుకొని మొక్కులు తీర్చుకునేందుకు ఆదివాసీలు సిద్దమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ పరిదిలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కొలువైన నాగోబా ఆలయంలో ఏటా పుష్య మాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మేస్రం వంశీయుల గోదావరి నది జలాలతో అభిషేకం చేసి, ప్రత్యేక పూజలతో నాగోబా జాతర ప్రారంబించడం ఆనవాయితీ.

ఈ జాతర ఉత్సవాలు నేటి నుంచి 28వ తేది వరకు జరుగుతాయి. నాగోబాను దర్శించుకోవడానికి ఈనెల 22న కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా (Union Tribal Minister Arjun Munda) రానున్నారు. 24న నిర్వహించే దర్బార్ సమావేశానికి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (State Minister for Tribal Affairs Satyavathy Rathore, Minister for Revenue Indrakaran Reddy, MLC Kalvakuntla Kavitha) హారరుకానున్నారు. గిరిజన సంక్షేమ శాఖ, దేవాదాయ శాఖలు రాఘవ జాతరకు కావలసిన రహదారులు, తాగునీరు, మౌలిక వసతులకు సంబంధించి కఅన్ని ఏర్పాట్లు చేసింది. ఆర్టీసి నిర్మల్, ఉట్నూర్, అసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ డిపోల (RTC Nirmal, Utnoor, Asifabad, Manchiryala, Adilabad Depots) నుంచి నేటి నుంచి 28వరకు ప్రత్యేక బస్సులు నడపనుందని ఆర్టీసీ ఆర్.ఎం జానీరెడ్డి (RM Johnny Reddy) తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల కోసం వైద్య ఆరోగ్య శాఖప్రత్యక వైద్య శిబిరం ఏర్పాటుచేసింది.

(Shubman Gill:ఆయన బ్యాటింగ్ చూసి చాలా నేర్చుకున్నా!)

Exit mobile version