end

Nallagutta Fire Accident : సికిందరాబాద్‌ నల్లగుట్టలో భారీ అగ్ని ప్రమాదం

nallagutta fire accident
  • డెక్కన్‌ నైట్‌వేర్‌ స్పోర్ట్స్‌ షోరూం(Deccan Nightware Sports)లో అగ్ని ప్రమాదం

Nallagutta : సికిందరాబాద్‌లోని నల్లగుట్టలోని ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం(Massive Fire Accident) సంభవించింది. ఉదయం గంటల సమయంలో సికిందరాబాద్‌(Secunderabad)లోని నల్లగుట్టలో డెక్కన్‌ నైట్‌వేర్‌ స్పోర్ట్స్‌ షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున అగ్నికీలలు(Fireworks) ఎగిసిపడుతున్నాయి. కార్ల విడిభాగాల గోదాంతోపాటు స్పోర్ట్స్‌ షోరూం నిర్వహిస్తున్నారు. విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌(Eeletric shot circuit) వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది (Fire Fighters), పోలీసులు(HYD Police) మంటలను ఆర్పడానికి సహాయక చర్యలు చేపట్టారు. ఆరు ఫైర్‌ ఇంజన్‌లతో మంటలు ఆర్పుతున్నారు. మూడు గంటలుగా ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో దట్టమైన పొగ(Heavy Smoke) చుట్టుపక్కల భవనాలను అలుముకుంది. దీంతో ప్రజలు ఇండ్లలలో నుండి బయటకు వచ్చేశారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. కార్లకు సంబంధించి రెగ్జిన్‌ మెటీరియల్‌, టైర్లు ఉండడం వల్ల మంటలు అదుపులోకి రావడం లేదు.

ఇదేగాక ప్రమాదం సంభవించిన కొద్ది దూరంలోనే అంటే కేవలం వంద మీటర్ల దూరంలో కిమ్స్‌ ఆసుపత్రి (KIMS Hospital)ఉంది. ఈ దట్టమైన పొగలు కిమ్స్‌ హాస్పిటల్‌ వైపు వ్యాప్తి చెందుతున్నాయి. పోలీసు అధికారులు, మంత్రి తలసానిశ్రీనివాస్‌ యాదవ్‌ ప్రమాద స్థలం వద్ద పరిస్థితులను సమీక్షిస్తున్నారు. రాణిగంజ్‌, నల్లగుట్ట, సింధికాలనీ, మినిస్టర్‌ రోడ్‌, ప్యారడైజ్‌ ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్‌(Traffic Jam) నిలిచిపోయింది. ట్రాఫిక్‌ పోలీసులు తమ శాయశక్తులా ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. మంటల్లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. దట్టమైన పొగ వల్ల పోలీసులు ఊపిరిపీల్చుకోలేక అస్వస్థతకు గురతున్నారు.

Exit mobile version