end

NASA: నాసా మూన్‌ మిషిన్‌ వాయిదా

nasa artemist rooket

నాసా(nasa) మూన్‌ మిషిన్‌ అర్టిమెసిస్‌-1(Artemis1) ప్రయోగం సోమవారం వాయిదా పడింది. చంద్రుడి(moon mission)పైకి వ్యోమగాములను పంపించడమే గాకుండా అక్కడ మానవులు నివసించే విధంగా ప్రయోగాలు చేయడానికి అమెరికా(US Space Agency) అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన ప్రయోగం నిలిచిపోయింది. రాకెట్‌ ఇంజన్‌లో సాంకేతిక సమస్య రావడంతో మిషన్‌ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. ఇంజిన్‌ నుండి ఇంధనం లీక్‌(Fuel Leak) అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా తెలిపింది. రాకెట్‌లో 10 లక్షల గ్యాలన్‌ల అతిశీతల హైడ్రోజన్‌(frozenhydrozen), ఆక్సిజన్‌(oxygen) నింపాల్సి ఉంటుంది. నాలుగు ఇంజన్లలో ఒక ఇంజన్‌ నుండి లీక్‌ అవుతున్నట్లు గుర్తించారు. ల్యాంచ్‌ప్యాడ్‌ సమీపంలో పిడుగు పడడంతో(lightingstrike) ఇది జరిగిఉండవచ్చని భావిస్తున్నారు. కౌంట్‌డౌన్‌ ప్రారంభమై చివరి గంటలో ప్రయోగాన్ని నిలిపివేశారు. అయితే మళ్లీ సెప్టెంబర్‌ మొదటి వారంలో మూన్‌ మిషన్‌ రాకెట్‌ ప్రయోగించన్నట్లు సమాచారం.

Exit mobile version