నవగుంజర ఇది ఒక జంతువు. ఇది 9జంతువులుగా మారగలదు, కనిపించగలదు. మహాభారతంలో దీని పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. విష్ణుమూర్తి అవతారం అయిన మృగంగా ఇది వస్తుంది. ఎవరైతే విశ్వరూప దర్శనం అర్జునుడికి ఇచ్చారో. ఇది గీతలో కూడా చెప్పబడింది. ఒడియాలో మహాభారతాన్ని పోయెట్ సరలదాస గారు రాశారు. అందులో ఈ నవగుంజర యొక్క గోప్పతనాన్ని వర్ణించాడు. ఒకప్పుడు, ఎప్పుడైతే అర్జునుడు ఒక కొండమీద తపస్సు చేయగా అప్పుడు విష్ణుమూర్తి ఈ నవగుంజర రూపంలో ప్రత్యక్షమయ్యాడు.
నవగుంజర అనేది ఇలా ఉంటుంది. దీని తల కోడిలా ఉండి, మొత్తం నాలుగు కాళ్లతో ఉంటుంది. అందులో మూడు కాళ్ళ మీద నిలబడి ఉంటుంది. ఆ కాళ్లు ఎలా అంటే, వరుసగా ఏనుగు కాలు, పులి కాలు, గుర్రం కాలు, నాలుగవ కాలు మాత్రం ఒక మనిషి చేతిగా మారి ఒక చక్రాన్ని పట్టుకున్నట్టు ఉంటుంది.
దాని మెడ నెమలి మెడ లా, తల పైభాగం లో ఒక దున్నపోతులా, పూర్తి వెనక భాగం ఒక సింహము లా దాని తోక పాములా ఉంటుంది. దీనినే నవగుంజర అంటారు.