end
=
Thursday, November 21, 2024
ఉద్యోగ సమాచారంనవోదయ విద్యాలయాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీ
- Advertisment -

నవోదయ విద్యాలయాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీ

- Advertisment -
- Advertisment -

కేంద్ర ప్రభుత్వ పరిధిలోఉన్న నవోదయ విద్యాలయ సమితి దేశ వ్యాప్తంగా టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రిన్సిపాల్స్‌, పీజీటి, టీజీటి, ఆర్ట్‌, పీఈటి, లైబ్రేరియన్స్‌ మొత్తం 1616 పోస్టులకు గాను అర్హత గల అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు కోరుతున్నారు.

పోస్టుల వివరాలు

ప్రిన్సిపల్‌–12
పీజీటీ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు)–397
టీజీటీ (ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు)–683
టీజీటీ (థర్డ్‌ లాంగ్వేజ్‌)–343
మిసిలేనియస్‌ కేటగిరీ (ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్స్‌)–181

అర్హతలు
ప్రిన్సిపల్‌– 50 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించరాదు.

పీజీటీ(పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు) – 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఆర్‌సీఈ(ఎన్‌సీఈఆర్‌టీ) నుంచి రెండేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించరాదు.

టీజీటీ(ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు)– 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఆర్‌సీఈ(ఎన్‌సీఈఆర్‌టీ) నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీతో పాటు బీఈడీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్‌ అర్హత సాధించి ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించరాదు.

మిసిలేనియస్‌ కేటగిరి (ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్‌):
అర్హత: గ్రాడ్యుయేషన్, డిప్లొమా(లైబ్రరీ సైన్స్‌), బీపీఈడీ, డిప్లొమా(ఫైన్‌ ఆర్ట్స్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ(మ్యూజిక్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించరాదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ/పర్సనల్‌ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.07.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -