end
=
Sunday, January 19, 2025
సినీమాజతకలిసే...
- Advertisment -

జతకలిసే…

- Advertisment -
- Advertisment -
  • పెళ్లి పేటలేక్కుతున్న న‌య‌న‌తార-విఘ్నేష్ శివ‌న్

నానుం రౌడీ తాన్ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార హీరో హీరోయిన్లుగా నటించారు. దానికి విఘ్నేష్ శివన్ దర్శకుడు. ఆ సినిమా సమయంలో ఏర్పడ్డ వారి పరిచయం ప్రేమగా మారింది. అయితే తమ ప్రేమ విషయాన్ని వారెప్పుడూ అధికారికంగా చెప్పలేదు. అయితే సోషల్ మీడియాలో వేదికగా వారు షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు వారి మధ్య సానిహిత్యాన్ని ప్రేమను తెలియజేస్తూ వచ్చాయి. పెళ్లి విష‌యాన్ని కూడా వీలైనంత‌గా గోప్యంగానే ఉంచే ప్రయత్నం చేస్తూ వ‌చ్చారు. డైరెక్టర్ విఘ్నేష్ శివన్, స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి గురువారం తమిళనాడు మహాబలిపురంలో జరగబోతుంది. ఈరోజు ఉద‌యం ముహూర్తాన్ని ఖరారు చేశారు.

మ‌హాబ‌లిపురంలోని ఓ రిసార్ట్‌లో వీరి పెళ్లి హై సెక్యూరిటీ న‌డుమ జ‌రుగుతుంది. ప‌రిమిత సంఖ్యలో కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, ఆహ్వానితులు ఈ పెళ్లికి వ‌స్తున్నారు. పేరున్న వారు వ‌స్తుండ‌టంతో హై సెక్యూరిటీ న‌డుమ పెళ్లిని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అంద‌రికీ వెళ్లిన ఆహ్వాన ప‌త్రిక‌ల్లో క్యూఆర్ కోడ్‌ను ఇచ్చారు. దాన్ని స్కాన్ చేసి అందులో వారి పేర్లను ఒక‌సారి చెక్ చేసి అతిథుల‌ను లోప‌ల‌కు పంపుతారు. ఈరోజు మ‌ధ్యాహ్నం ఫొటోల‌ను రిలీజ్ చేస్తామ‌ని విఘ్నేష్ తెలియ‌జేశారు. జూన్ 11న విఘ్నేష్, న‌య‌న్ క‌లిసి మీడియా ముందుకు రాబోతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -