నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్) పీజీ పరీక్షా వాయిదా పడింది. మార్చి 12న జరగాల్సిన నీట్ పరీక్షను 6-8 వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నీట్ పరీక్ష 2022 వాయిదా వేయాలని ఆరుగురు ఎంబీబీఎస్ విద్యార్థుఉలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టాల్సి ఉండగా కేంద్ర ఆరోగ్యశాఖ వెంటనే నీట్ పీజీ పరీక్షను వేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ ఈ పరీక్షను దాదాపు 8 వారాల తర్వాత ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.
సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు కోవిడ్