end

నెగెటివ్‌ మార్కుల విధానానికి స్వస్తి

  • ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
  • ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం

గానగంధర్వుడు బాలు ఇక లేరు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఇక నుండి డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో నెగిటివ్‌ మార్కుల పద్దతికి స్వస్తి పలికింది. దీనికి సంబంధించిన ఉత్వర్వుల మీద ఏపీ సిఎం వై.ఎస్‌.జగన్‌ సంతకం చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్‌ వెంకటరామిరెడ్డి ఇప్పటికే వెల్లడించారు. ఇదేగాకుండా ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే శాఖపరమైన పరీక్షలలో కూడా నెగెటివ్‌ మార్కుల విధానాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు సాదారణ పరిపాలన శాఖ సర్వీసుల ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ తెలిపారు.

సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్‌

డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో నెగెటివ్‌ మార్కుల విధానం గత 2016 నుండి ఆంధ్రప్రదేశ్‌లో అమలులో ఉంది. ఒక తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కట్‌ చేసేవారు. దీంతో 10 శాతం మంది కూడా పాస్‌ కావడం లేదు. చాలా మంది ఉద్యోగులు సకాలంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందలేకపోతున్న విషయాన్ని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సిఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం దీనిని పరిగణలోకి తీసుకొని నెగెటివ్‌ మార్కుల విధానాన్ని రద్దు పరుస్తూ ఉత్వర్వులు ఇచ్చారు.

యూనివర్సిటీల్లో విద్యా సంవత్సరం ప్రారంభం

Exit mobile version