end

ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు కొత్త ఫ్లైఓవర్

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం భారీగా ఫ్లైఓవర్ల నిర్మాణం పనులు చేపట్టారు. ఇప్పటికే ఎన్ని ఫ్లైఓవర్లు అందుబాటులోకి రాగా తాజాగా మరో అతి పెద్ద ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. గచ్చిబౌలిలో శిల్పా లేఅవుట్ వంతెన పనులు వేగంగా పూర్తి అవుతున్నాయి. గచ్చిబౌలి నుంచి ఓఆర్‌ఆర్ వరకు 4 లేన్లలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు త్వరత్వరగా పూర్తి చేస్తోంది. ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతున్న ఈ బ్రిడ్జిని ఆగస్టులో ప్రారంభించేందుకు అధికారులు సన్నహలు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి, మైండ్‌స్పేస్ జంక్షన్, హైటెక్ సిటీలో ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. దీనిని ఆగస్టులో ప్రారంభించేందుకు అధికారులు సన్నహలు చేస్తున్నారు.

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ మీనాక్షి, ఐకియాలను కలుపుతూ రూ.313.52 కోట్లతో ఔటర్‌రింగ్‌ రోడ్డు వైపు 4 లైన్లు, 823 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతోనూ.. కొండాపూర్ వైపు 6 లైన్లు, 816 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతోనూ నిర్మిస్తున్న ఈ బైడైరెక్షనల్ ఫ్లైఓవర్ కు 2019 నవంబరు 4న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశాడు. 2019 డిసెంబరులో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించారు

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ చేత ఇంజనీరింగ్ ఫీట్ అని పిలువబడుతున్న ఈ ఫ్లైఓవర్, భూమి నుండి 18 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయబడుతోంది. దీని నిర్మాణంలో భాగంగా అత్యంత పొడవైన స్పాన్‌ను గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా 64 మీటర్ల మేర బిగించబడింది. ఫేజ్‌-1లోని వై ఆకారంలో నిర్మించబడుతున్న ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళి ఔటర్‌రింగ్‌ రోడ్డుకు ఇరువైపులా తాకుతుంది. ఈ ఫ్లైఓవర్‌ నుంచి గచ్చిబౌలి వంతెన కన్నా ముందే వాహనాలు కిందకు దిగే వీలుగా ఓ ర్యాంపు ఉంటుంది. మరొకటి నేరుగా బాహ్య రహదారిని కలుపుతుంది.

Exit mobile version