end
=
Sunday, January 19, 2025
రాజకీయంజనసేన కోసం కొత్తగా....
- Advertisment -

జనసేన కోసం కొత్తగా….

- Advertisment -
- Advertisment -

దసరా నుంచి పవన్ రాష్ట్రవ్యాప్త పర్యటన:
దసరా నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త టూర్‌కి సిద్ధమవుతున్నా సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన కోసం కొత్త కాన్వాయ్‌ని సిద్ధం చేశాయి ప్రభుత్వ వర్గాలు. ఈ మేరకు కొత్త బ్లాక్ స్కార్పియో కార్లు జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. దసరా నుంచి ఏపీ అంతటా పర్యటించాలని పవన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కొత్త బ్లాక్ స్కార్పియో కార్లను పవన్ కల్యాణ్ టూర్ కోసం సిద్ధం చేశారు. అక్టోబర్ 5 నుంచి పవన్ పర్యటన ప్రారంభంకానుంది.

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముందే వస్తాయన్న అంచనాతో బస్సు యాత్రకు సిద్దం అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ . విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. 2023 మార్చిలోనే ఎన్నికలు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆ ఎన్నికలకు అందరూ సిద్ధంగా వుండాలంటూ పిలుపునిచ్చారు. తిరుపతి నుంచి పవన్ బస్సు యాత్రను ప్రారంభిస్తారని మనోహర్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 కాదు కదా.. 30 సీట్లు రావని ఆయన ముందుగా ఊహించి చెప్పారు. 6 నెలల్లో రాష్ట్రమంతా పవన్ పర్యటిస్తారని… ప్రతి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభ వుంటుందని నాదెండ్ల తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -