end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంతెలంగాణ లో కొత్త రేషన్​ కార్డులు...
- Advertisment -

తెలంగాణ లో కొత్త రేషన్​ కార్డులు…

- Advertisment -
- Advertisment -

తెలంగాణలో రేషన్‌కార్డులు రద్దయిన పేదలకు తిరిగి మంజూరు కానున్నాయి. రేషన్‌కార్డులు రద్దయినవారిలో అర్హులుంటే గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. తొలగించిన కార్డుల్లోని చిరునామాల ఆధారంగా గ్రామాలు, పట్టణాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయా కుటుంబాల స్థితిగతులను పరిశీలించి అర్హులని తేలితే రేషన్‌కార్డులను పునరుద్ధరిస్తారు. రేషన్‌కార్డుల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ మంగళవారమే మొదలైందని ఈ నెల 20 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో గతంలో రద్దయిన రేషన్‌ లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయడం కోసం వారి డేటాను రేషన్‌షాపుల నుంచి సేకరించనున్నారు. ఆ జాబితాలను అన్ని రేషన్‌షాపులు, గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలి. రద్దయిన కార్డుదారులకు సంబంధించి తనిఖీ అధికారి సంప్రదించలేని, గుర్తించలేని వారికి నోటీసులను వారి చిరునామాకు పోస్ట్‌ చేయాలి వారి ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించాలి. రీవెరిఫికేషన్‌పై స్థానిక ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచారం చేయాలి. ఎవరైనా తిరిగి రేషన్‌కార్డు పొందేందుకు అర్హులని తేలితే వెంటనే ఆ వివరాలను నమోదు చేయాలి. రద్దు చేయబడిన కార్డుకు సంబంధించిన కారణాలను కూడా నమోదు చేయాలి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -