end

New Year Celebrations:న్యూ ఇయర్ వేడుకలకు కొత్త రూల్స్

  • పార్టీలకు ముందు పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సిందే
  • అనుమతులు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డిపార్ట్‌మెంట్
  • పబ్స్, రిసార్ట్స్, రెస్టారెంట్ యాజమాన్యాలకు వార్నింగ్


ఈ యేడాది కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. గత రెండేళ్లపాటు కరోనా కారణంగా న్యూ ఇయర్ (NEW YEAR)సెలబ్రేషన్స్‌కు దూరమైన యువత ఈ సారి భారీ ఎత్తున్న పార్టీలను (Party) ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి ప్లాన్లు వారు చేసుకుంటున్నారు. ఎలా ఎంజాయ్ చేయాలి అన్నదానిపై ఎవరికి తోచిన విధంగా వారు ప్రణాళికలు రచించుకుంటున్నారు. హోటల్స్, పబ్‌లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్ (Hotels, Pubs, Restaurants, Resorts) అప్పుడే న్యూ ఇయర్ వేడుకలకు ఫుల్‌గా రెడీ అయిపోతున్నాయి. యూత్‌కు నచ్చేలా, స్నేహితులతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఎవరు ఏం చేయాలనుకున్నా కండిషన్స్ ఫాలో కావాల్సిందే అంటున్నారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు (Police) పలు నిబంధనలు పెట్టినట్లు స్పష్టం చేశారు.

త్రీస్టార్‌ (Star) అంతకంటే పెద్ద హోటళ్లు, పబ్బులు, క్లబ్బులు (Hotels, pubs, clubs) రాత్రి 1గంట వరకు నిర్వహించే వేడుకలకు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలి. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, (Entry, exit points,) పార్కింగ్ ప్రదేశాల్లో విధిగా సీసీటీవీ కెమెరాలు (CCTV)అమర్చాలి. వేడుకల్లో శబ్దతీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదు. మద్యం సేవించినవారు పార్టీ తర్వాత డ్రైవింగ్‌ (Drunk and drive) చేయకుండా, ఇంటికి చేరేలా చూసే బాధ్యత ఆయా పబ్‌లు, రిసార్ట్స్ యాజమాన్యాలదే అని పోలీసులు తెలిపారు. అంతేకాదు పబ్‌లలో డ్రగ్స్ (Drugs), ఇతర మత్తుపదార్థాల వినియోగంపై దృష్టి పెట్టాలని, అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

కొత్త సంవత్సరం వేడుకల్లో యూత్ మత్తులో జోగేలా చేసేందుకు డ్రగ్స్ సరఫరాదారులు సైతం పక్కా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో నగరంలో ఏదో ఒకచోట తరచూ డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. వీరందరి టార్గెట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీదనే.. ఇయర్ ఎండ్ పార్టీల మీద ఫోకస్ చేసిన విక్రయదారులు గోవా, కశ్మీర్, ఆంధ్రప్రదేశ్‌తో (Goa, Kashmir and Andhra Pradesh) పాటు ఆయా రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ను నగరానికి తెప్పించడంలో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు నగర శివారుల్లోనూ లోకల్ మేడ్‌గా తయారు చేస్తూ.. ఈ ఇయర్ ఎండ్‌లో వీలైనంత ఎక్కువగా సప్లై చేసి కోట్లకు పడగెత్తాలని కొందరు అక్రమార్కులు ఈ బిజినెస్‌లోకి దిగుతున్నారు. ఇలాంటి వారికి పాత ఫార్మా కంపెనీలు (Pharma companies) అడ్డాగా మారాయని తెలిసింది. అందులోని ల్యాబుల్లో పలు రకాల మాదకద్రవ్యాలను తయారు చేస్తున్న ముఠాలు యూత్ మీదకు వదులుతున్నాయి. వీటి మత్తులో పడ్డ యూత్, విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

(ECIL: హైదరాబాద్‌లో ఉద్యోగాలు)

ఇదివరకు చిన్నాచితకా గంజాయి కేసులు నమోదయ్యే హైదరాబాద్‌లో (Hyderabad) ఇప్పుడు గంజాయి కంటే డ్రగ్స్ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాగే ఒకప్పుడు డ్రగ్స్ పట్టుబడ్డాయి అంటే ఆఫ్రికన్ల అరెస్టులు ఉండేవి. ఇప్పుడు లోకల్ ముఠాలే డ్రగ్స్ తయారు చేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ వినియోగంలో గోవా, ఢిల్లీ (Delhi) నగరాల తర్వాత హైదరాబాద్ మూడో స్థానంలో ఉందంటే అతిశయోక్తికాదు. ప్రతీ చిన్న పార్టీలో కూడా డ్రగ్స్ వాడకం కామన్‌గా మారింది. బర్త్ డే వేడుకలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలు ఏదో ఒకరకమైన డ్రగ్స్ లేకపోతే నామోషీగా ఫీలవుతున్నారు కొందరు. ఆయా జిల్లాల్లో లభించే గంజాయితో పాటు కొకైన్, హెరాయిన్, చరాస్, ఎండీఎంఏ బ్లోట్స్, ఓపియం, ఎఫెడ్రోన్, ఎల్ఎస్ఏ స్ట్రిప్స్, ఎలీసీ బ్లోట్స్ (Cocaine, Heroin, Charas, MDMA Bloats, Opium, Ephedrone, LSA Strips, ELC Bloats) ఇప్పటికే నగరానికి సరాఫరా అవుతున్నట్లు సమాచారం.

గతంలో సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ మత్తు మందులు ఇప్పుడు సామాన్యుల చెంతకు కూడా చేరాయి. చివరికి స్కూలు విద్యార్థులకు సైతం మత్తుమందులు దొరుకుతున్నాయంటే ఈ డ్రగ్స్ ముఠాలు ఏస్థాయిలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. చిత్రసీమను, ఐటీ ఎంప్లాయిస్‌ను టార్గెట్‌గా చేసుకుని రంగంలోకి దిగిన డ్రగ్స్ ముఠాలు. సామాన్యులను సైతం తమ ఉచ్చులోకి లాగుతున్నాయి.

ఎన్నెన్నో రకాలు..
మాదకద్రవ్యాల్లో అనేక రకాలున్నాయి. వాటి క్వాలిటీ, ఇచ్చే కిక్కును బట్టి వాటి విలువ కూడా మారుతూ ఉంటుంది. ఇదివరకు నగరంలో కేవలం గంజాయి దొరకడమే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు దేశ విదేశాలకు చెందిన డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు అక్రమార్కులు. కొకైన్, ఓపియం, హెరాయిన్, ఎల్ఎస్, ఎండీఎంఏ, బ్రౌన్ షుగర్, చరస్, వంటి డ్రగ్స్‌కు హైదరాబాద్‌లో మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

శాఖల మధ్య సమన్వయ లోపం
నగరంలో తరుచూ ఏదో ఒకచోట డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. అయినా అధికారులు నియంత్రణలో సీరియస్‌గా వ్యవహరించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నార్కోటిక్ సెల్, డ్రగ్ కంట్రోల్ బోర్డ్, డీఆర్ఐ, సీఐడీలోని యాంటీ నార్కోటిక్ సెల్, ఎక్సైజ్ శాఖలు (Narcotic Cell, Drug Control Board, DRI, Anti Narcotic Cell in CID, Excise Departments) ఉన్నా, సరైన నిఘా లేక సరఫరాదారులు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఇయర్ ఎండ్ టార్గెట్‌గా డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారిని అధికారులు ఎలా కట్టడి చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

(Civil Assistant Surgeon:950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సెలక్షన్ లిస్ట్ విడుదల)

Exit mobile version