end

Cricket:సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు కొత్త నిబంధనలు

  • వర్షం ఎఫెక్ట్‌తో సవరణలు చేసిన ఐసిసి
  • రెండు ఇన్నింగ్స్‌ల్లో 20 ఓవర్లు తప్పనిసరి

T20 World Cup: ఈ యేడాది ఆస్ట్రేలియా (Australia)లో జరుగుతున్న 8వ ఎడిషన్ పొట్టి ప్రపంచకప్‌కు (world cup)వర్షం (rain) అంతరాయం కలిగిస్తూనే ఉంది. అయితే  ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో వర్షకారణంగా అఫ్ఘానిస్తాన్ (Afghanistan)ఊహించని విధంగా నష్టపోగా కొన్ని జట్లకు మేలు జరిగింది. ఇక ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇకపై జరగబోయే పోటీలు మరో ఎత్తు. సెమీఫైనల్, ఫైనల్ ఫైట్‌కు (Semi final)రంగం సిద్ధమైంది. గతంలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు వర్షం పడితే కనీసం 10 ఓవర్లు (overs)ఆడితేనే మ్యాచ్ ఫలితం నిర్ణయించేవారు. అయితే ఈ సారి రూల్స్ మార్చేసింది ఐసిసి(ICC). టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో ఫలితాన్ని పొండాలంటే కనీసం 20 ఓవర్లు ఆడాల్సిందే. ఆ రూల్స్ (Rules)ఎమిటో తెలుసుకుందాం.

టీ20 ప్రపంచకప్ 2022 సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు నవంబర్ (November) 9, 10 తేదీలలో జరుగుతాయి. అయితే, వర్షం పడితే మ్యాచ్‌కు సంబంధించిన నిబంధనలను ఐసీసీ మార్చింది. దీనిపై ఐసీసీ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వనప్పటికీ.. మీడియా కథనాల ప్రకారం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లో కనీసం 20 ఓవర్లు ఉండాలని ఐసీసీ నిర్ణయించిందని, అప్పుడే మ్యాచ్ ఫలితం తేలనుంది. వర్షం కారణంగా 20 ఓవర్లు ఆడకపోతే తమ గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు (final)చేరుకుంటుంది. సాధారణంగా టీ20 మ్యాచ్‌లో 40 ఓవర్లు ఉంటాయి. వర్షం వస్తే, కనీసం ఐదు ఓవర్లు ఇన్నింగ్స్‌లో (Innings) ఆడాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మ్యాచ్ ఫలితం నిర్ణయిస్తారు. ఒక ఇన్నింగ్స్‌లో వర్షం కారణంగా ఐదు ఓవర్లు ఆడలేకపోతే, మ్యాచ్ రద్దు చేస్తారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఈ నిబంధన కింద మ్యాచ్‌లు జరుగుతుండగా, ఈ నిబంధనతో ఐర్లాండ్ (IRELAND)టీం ఇంగ్లండ్‌ను (England)ఓడించింది.

సెమీఫైనల్స్ నిబంధనలు:

అయితే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు ముందు ఐసీసీ ఈ నిబంధనలు వేరుగా ఉంటాయి. రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల ఫలితాలను పొందాలంటే, ఒక ఇన్నింగ్స్‌లో కనీసం 10 ఓవర్లు ఆడాలి. ఒకవేళ మ్యాచ్ జరగాల్సిన తేదీన వర్షం కారణంగా ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు ఆడకపోతే, మ్యాచ్ అక్కడితో ఆగి, మరుసటి రోజు అక్కడి నుంచే మ్యాచ్ ప్రారంభమవుతుంది. 2019లో భారత్ (India), న్యూజిలాండ్ (New zealand) మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే జరిగింది. మిగిలిన ఓవర్లు తర్వాత నిర్వహించారు. కనీసం 20 ఓవర్లు ఆడిన తర్వాత మ్యాచ్ ఫలితం ప్రకటిస్తారు. వర్షం కారణంగా మరుసటి రోజు ఆట జరగకపోతే లేదా ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు ఉంటే, మ్యాచ్ రద్దు చేస్తారు. సూపర్-12 దశలో తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో 10 ఓవర్లు ముగిసేలోపు జట్టు ఆలౌట్ అయితే మాత్రమే 20 ఓవర్ల కంటే తక్కువ మ్యాచ్ జరుగుతుంది.

ఫైనల్‌కు (Final) నియమాలు?

ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఫలితం రావాలంటే ఇన్నింగ్స్‌లో కనీసం 10 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. లేకపోతే, మిగిలిన ఓవర్లు మరుసటి రోజు ఆడిస్తారు. అప్పుడు కూడా 20 ఓవర్లు ఆడకపోతే ఇరు జట్లను ఉమ్మడి విజేతలుగా (Winner) ప్రకటిస్తారు. అయితే మ్యాచ్ టై అయితే ఉమ్మడి విజేతలు ఉండరు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్లు కొనసాగుతాయి.

ఇదిలావుంటే.. టీ20 ప్రపంచకప్ 2022లో గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ (England)జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాయి. చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీం శ్రీలంకపై (Sri Lanka)విజయం సాధించి సెమీస్ టికెట్ దక్కించుకుంది. న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ 2022లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. శనివారం ఇంగ్లండ్ కూడా అదే గ్రూప్‌లోని శ్రీలంకను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్‌ 1 నుంచి మొత్తంగా ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌లతో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇక ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడిన ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాకు మాత్రం టీ20 ప్రపంచ కప్‌లో భారీ షాక్ తగిలింది. సెమీస్ చేరుకోకుండానే సూపర్ 12 నుంచి నిష్క్రమించింది. శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కచ్చితంగా దేశవాళీ అభిమానుల హృదయాలను బద్దలు కొట్టింది. ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్‌కు వెళ్లేందుకు సమీకరణాలు స్పష్టంగా కనిపించాయి. శ్రీలంకపై విజయంతో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకి సెమీ ఫైనల్ టికెట్ ఖాయం చేసుకుంది. సిడ్నీ (Sidney)మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించి ఆస్ట్రేలియా ప్రయాణానికి తెరపదించింది.

(PM Modi:తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్న భారత ప్రధాని)

సెమీఫైనల్లో ఇంగ్లండ్..

న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించి గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ మాత్రమే కాగా, ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఖాతాలో ఏడు పాయింట్లతో +2.113 నెట్-రేట్‌తో (Run Rate)సెమీ-ఫైల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్ జట్టు శనివారం ముందు ఐదు పాయింట్లను కలిగి ఉంది. కానీ, శ్రీలంకను ఓడించిన తర్వాత రెండు పాయింట్లను పొందింది. ఆస్ట్రేలియా కూడా ఏడు పాయింట్లను కలిగి ఉంది. అయితే ఆ టీం నెట్ రన్ రేట్ ఇంగ్లాండ్ కంటే తక్కువగా ఉంది. దీని కారణంగా ఆజట్టు క్వాలిఫైయింగ్‌లో (Qualify)విజయం సాధించలేకపోయింది.

ఆసక్తిగా గ్రూప్ 2 ఫలితాలు.. ఇప్పటికే గ్రూప్ 1 నుంచి కివీస్, ఇంగ్లండ్ టీంలు సెమీస్ చేరడంతో.. ఇక ఇప్పుడు అందరి చూపు గ్రూప్ 2 ఫలితాలపై (Result)ఆధారపడింది. రేపు జరగనున్న మూడు పోటీలతో సెమీస్ చేరే ఆ రెండు జట్లు ఏవో తెలియనున్నాయి. గ్రూప్ 1లో టీమిండియా ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. రేపు జింబాబ్వేతో (Zimbabwe) కీలకమ్యాచ్ ఆడేందుకు రోహిత్ (Rohit) సేన సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా సెమీస్ టికెట్ దక్కించుకుంటుంది. అలాగే సౌతాఫ్రికా (South africa)టీం కూడా నెదర్లాండ్స్‌తో (Nedarland)మ్యాచ్ గెలిస్తే సెమీస్ చేరే రెండో జట్టుగా నిలవనుంది. అయితే, ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప భారీ మార్పులు చూడొచ్చు.

(Tracking App:స్వచ్ఛమైన గాలికోసం ‘ట్రాకింగ్ యాప్స్’)

Exit mobile version