ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కొత్త కొత్త రోగాలు(dieses) పుట్టుకొస్తున్నాయి. ఒక దిక్కు కరోనా(coronavirus).. మరోదిక్కు మంకీపాక్స్(monkeypox).. ఇంకో వైపు మరో కొత్త వైరస్ టొమాటో ఫ్లూ(tomatoflu). కొత్తగా టొమాటో ఫ్లూ ఇండియాలో ప్రమాద సంకేతాలిస్తోంది. ఇది చిన్నపిల్లలకే ఎక్కువగా వస్తుంది.చిన్నారుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని లాన్సెట్ జర్నల్ హెచ్చరించింది. టొమాటో ఫ్లూగా పిలిచే ఈ వ్యాధిలో చేతులు, కాళ్లు , నోటికి సంబంధించిన వ్యాధి ఇది. ఇప్పటికే దేశంలో కేరళ, ఒడిశాల్లో ఈ వ్యాధి లక్షణాలు కన్పించాయి. ఇండియాలో తొలిసారిగా మే 6వ తేదీన కేరళ(kerala)లోని కొల్లామ్(kollam)లో ఈ వ్యాధి కనుగొన్నారని ఇప్పటివరకూ 82 మంది చిన్నారులకు వ్యాధి సోకినట్టు ప్రముఖ అంతర్జాతీయ హెల్త్ మేగజైన్ లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ హెచ్చరించింది. ఈ చిన్నారులంతా 5 ఏళ్లలోపువారు కావడం విశేషం.
(Monkeypox ప్రపంచాన్ని వణికిస్తున్నా మంకీపాక్స్)
ఇప్పటికే కరోనా ఫోర్త్‌వేవ్(coronavirus forth wave)ఆందోళనను ఎదుర్కొంటున్న నేపధ్యంలో కొత్త వైరస్ టొమాటో ఫ్లూ లేదా టొమాటో ఫీవర్ మరింత ఆందోళన కల్గిస్తోంది. ఈ వ్యాధి ఇంటెస్టైనల్ వైరస్ కారణంగా వస్తుంది. పెద్దవారిలో చాలా అరుదుగా కన్పిస్తుంది. అది కూడా రోగ నిరోధక శక్తి(Immunity power) మరీ తక్కువగా ఉన్నవారిలో వస్తుంది. ఈ వ్యాధి సోకితే కాళ్లు, చేతులు, నోటిపై ఎర్రగా, నొప్పితో కూడిన నీటి పొక్కుల్లా ఏర్పడతాయి. ఇవి క్రమంగా టొమాటో సైజులో పెరుగుతాయి. అందుకే వీటిని టొమాటో ఫ్లూ అని పిలుస్తున్నారు.
తీవ్రమైన జ్వరం(fever), ఒళ్లు నొప్పులు, జాయింట్ పెయిన్స్, అలసట, నీరసం. కొద్దిగా చికెన్ గున్యా లక్షణాలు కన్పిస్తాయి. కొంతమంది రోగుల్లో నాసియా, వాంతులు, డయేరియా, జ్వరం, డీ హైడ్రేషన్, జాయింట్లలో నొప్పి, ఒళ్లు నొప్పులుంటాయి. టొమాటో ఫ్లూతో ఆరోగ్యం క్షీణిస్తుందని చికిత్సకై ఇంకా నిర్దిష్టమైన మందు లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది వేగంగా సంక్రమించే వ్యాధి అని హెచ్చరించారు.